Health insurance : ఆరోగ్యభీమా తీసుకున్నవారికి శుభవార్త
--ఇకపై అన్ని ఆసుపత్రులలో ఆ సదుపాయం అమలు --ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ పేమెంట్ సదుపాయo
ఆరోగ్యభీమా తీసుకున్నవారికి శుభవార్త
–ఇకపై అన్ని ఆసుపత్రులలో ఆ సదుపాయం అమలు
–ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ పేమెంట్ సదుపాయo
ప్రజా దీవెన/హైదరాబాద్: ఆరోగ్య భీమా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్. ఇకపై అంటే ఈ నెల జనవరి 25వ తారీఖు నుంచే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్ పేమెంట్ సదుపాయాన్ని పాలసీదారులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫెసిలిటీ అమల్లోకి వచ్చిందని ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలి పింది.
జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సమగ్ర చర్చలు జరిపి న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించింది. ఇన్సూరెన్స్ పాలసీదారులు పాలసీ నెట్వర్క్ లిస్ట్‌లో కవర్ కాని ఏ ఆసుపత్రిలోనైనా ఈ క్యాష్‌లెస్ పేమెంట్ ఫెసిలిటీని అందుకోవచ్చు. అయితే నెట్‌వర్క్‌లో లిస్టు కాని ఆసుపత్రిలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే 48 గంటలకు ముందే ఇన్సూరెన్స్ కంపెనీ కి ఆ విషయాన్ని తెలియజేయాలి.
అత్యవసర పరిస్థితులలో ఆసు పత్రిలో చేరితే 48 గంటల్లోగా సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చేరవేయాలి. క్యాష్‌లెస్ పేమెంట్ అంటే ఎలాంటి ముందస్తు ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నెట్వర్క్ కవర్డ్ ఆసుపత్రిలో వైద్య చికిత్సను పొందవచ్చు. బీమా కంపెనీ నేరుగా ఆసుపత్రితో బిల్లులను సెటిల్ చేస్తుంది, కాబట్టి ఫైనాన్షియల్ వర్క్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కొత్త నిబంధన అమల్లోకి రాకముందు క్యాష్‌లెస్ పేమెంట్ ఆప్షన్ పాలసీ నెట్‌వర్క్‌లో జాబితా అయిన ఆసుపత్రులలో మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు అన్ని ఆసుపత్రు లలో ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. క్యాష్‌లెస్ పేమెంట్ చేయలేక పోయినప్పుడు ఆసుపత్రిలో చేరిన సమయంలోనే జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.తర్వాత రియింబర్స్‌మెంట్ కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్పత్రిలో ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వసూలు చేయడానికి చాలా సమయం పట్టేది. ఆ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడా తలనొప్పు లన్నీ ఇన్సూరెన్స్ పాలసీదారులకు తప్పనున్నాయి. ఈ సదుపాయా న్ని అందరూ ఉపయోగించుకుంటూ హాస్పటలైజేషన్ సమయంలో ఇబ్బందులు పడకుండా కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు మెసేజ్ లు పంపిస్తున్నాయి.
ఇకపోతే సదుపాయం అందుబాటులోకి రాకముం దు ఇన్సూరెన్స్ పాలసీదారులలో 63 శాతం మంది క్యాష్ లెస్ పేమెం ట్ వినియోగించు కుంటున్నట్లు తెలిసింది. మిగతావారు దరఖాస్తు పద్ధతిలో రిఫండ్ కోరుతున్నారు. ఈ సదుపాయంతోబీమా దారులు మోసపోయే ఛాన్సులు కూడా చాలా వరకు తగ్గుతాయి.
మీరు కూడా ఇన్సూరెన్స్ పాలసీదారులు అయితే కంపెనీ కస్టమర్లకు ఫోన్ చేసి ఈ ఫెసిలిటీ గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే ఈ ఫెసిలిటీ తప్పకుండా యూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి.