Hero Dhalapathi vijay : విజయ్ కొత్త పార్టీ టీవీకే
--ప్రత్యక్ష రాజకీయాల్లోకి దక్షిణాది నటుడు --పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం రిజిస్టర్ --2024 లోక్ సభ కు పోటీ చేయబోమని వెల్లడి --2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధo
విజయ్ కొత్త పార్టీ టీవీకే
–ప్రత్యక్ష రాజకీయాల్లోకి దక్షిణాది నటుడు
–పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం రిజిస్టర్
–2024 లోక్ సభ కు పోటీ చేయబోమని వెల్లడి
–2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధo
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దక్షిణాదిన పేరొందిన నటుడు, తమిళ సినీ దళపతి విజయ్ శుక్రవారం తన నూతన పార్టీ పేరు తమిళ్ వెట్రి కజగం (TVK) అని తెలియజేశారు. విజయ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో 2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు పలకబోమని కూడా స్పష్టం చేశారు. దీనిపై తమ పార్టీ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చామని తెలిపారు.
గత కొంతకాలంగా విజయ్ రాజకీయ అరంగేట్రం పై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తు న్నాయి. తాజాగా వీటన్నింటికీ సమాధానమిస్తూ విజయ్ తన పార్టీ పేరును ప్రకటించారు. అలాగే దేశంలోని రాజకీ యాలపై తన అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరును ఎన్నికల సంఘంలో త్వర లోనే రిజిస్ట్రేష స్ చేయిస్తామని అన్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందని తెలిపారు.
తమిళ నాట రాష్ట్ర రాజకీయాలు అవినీతిలో కూరుకుపో యి, బ్రష్టపట్టాయని అరోపిం చారు. అవినీతి రహిత సెక్యులర్ ప్రభుత్వాన్ని తాము కోరుకుటున్నా మని విజయ్ ఆ ప్రకటనలో తెలిపారు.కులమత ప్రతిపదిక ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనకు సినిమాల పరంగా కొన్ని కమిట్ మెంట్లు ఉన్నాయని, అవి పూర్తయి న వెంటనే పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.
కాగా విజయ్ రాజకీయ ప్రవేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయని అతని అభిమానులు వ్యాఖ్యాని స్తున్నారు. 1974, జూన్ 22 విజయ్ జన్మించారు. విజయ్ ప్లేబ్యాక్ సింగర్ గానూ తన ప్రతిభ చూపారు. విజయ్ తమిళం తో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటించారు. అభిమానులు విజ య్ థలపతి అని పిలుచుకుంటారు.
తమిళనాట అత్యధిక పారితోషికం తీసుకునే నటునిగానూ విజయ్ పేరొందారు. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ కు అభిమానులున్నారు. విజయ్ నటనలో అత్యుత్తమ ప్రతిభచూపి పలుఅవార్డులను కూడా అందుకున్నారు. స్టార్ ఇండియా నుంచి ఏడు పురస్కారాలను, తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకోవడం తో పాటు సైమా అవార్డును సైతం అందుకున్నారు.
భారత్ లోని సెలబ్రిటీల ఆదాయ పరంగా ఫోర్బ్స్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ వందమంది సభ్యుల జాబితాలో విజయ్ పేరు కూడా ఉంది. దీంతో విజయ్ స్థాపించిన కొత్త పార్టీ కి తమిళనాడు లో తొందరలోనే ఆదరణ లభించే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
విజయ్ తమిళ్ సిని పరిశ్రమలో నిలదొక్కుకుని ఇప్పటికే స్థిర పడి నoదున ఆయన చెప్పిన మాటల ప్రకారం కొన్ని ప్రాజెక్టులు త్వరిత గతిన పూర్తి చేసుకొని రాజకీయాలపై పూర్తి స్థాయిలో తనదైన శైలి లో ప్రజల్లోకి వెళ్తారని తమిళనాడు రాజకీయ పార్టీలు చర్చించుకుం టున్నాయి.