Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Heroin Roja : ఎన్నారై ఫ్రెండ్స్‌తో ఎంజాయ్

--అలా చేస్తున్నదెవరి కూతురో ఎరుకేనా --ఆంధ్రా ఫైర్ బ్రాoడ్ రోజా కూతురట

 

ఎన్నారై ఫ్రెండ్స్‌తో ఎంజాయ్

–అలా చేస్తున్నదెవరి కూతురో ఎరుకేనా
–ఆంధ్రా ఫైర్ బ్రాoడ్ రోజా కూతురట

ప్రజా దీవెన/హైదరాబాద్: తెలుగు సినిమాతో పాటు రాజకీయ రంగంలో కూడా సంచలనాలకు మారుపేరైన రోజా మరో సంచలనా నికి కేంద్రంగా నిలిచింది. 1990 నుంచి 2000 కాలం వరకు టాలీ వుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక వెలుగు వెలి గింది ఆర్కే రోజా. తర్వాత రాజకీయాల్లో అరంగేట్రం చేసి అంచెలం చెలుగా ఎదిగింది. మొదటగా ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతోంది.

రాజకీయాల్లో కొనసాగుతూనే టీవీలో కూడా రోజా చాలా కాలం పని చేసింది. తన కొడుకు, కూతురును కూడా టీవీ షోలకు తీసుకొచ్చి పరిచయం చేసింది. కూతురు అన్షుమాలిక అప్పట్లో చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ బాలిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలా రోజా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది.

ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ యూఎస్‌లోని లడ్డీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్‌ లో కంప్యూటింగ్, ఇంజనీరింగ్‌ కోర్సు చేస్తోంది. ఇన్‌స్టా వేదికగా తన యూనివర్సిటీ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. కాలేజీ ఫ్రెండ్స్ తో గడిపిన క్షణాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటుంది.

తాజాగా అన్షుమాలిక తన యూనివర్సిటీ ఫ్రెండ్స్, ఎన్నారై స్నేహితు లతో కలిసి ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ట్రిప్ లో పాల్గొన్నది. డొమిని కన్ రిపబ్లిక్‌లో ఆ పర్యటన జరిగింది. ఈ పర్యటనలో భాగంగా అన్షు మాలిక & ఫ్రెండ్స్ పేదరిక నిర్మూలన, పర్యావరణ సుస్థిరత, పేద ప్రజలకు అవసరమైన సేవలకు యాక్సెస్ వంటి ముఖ్యమైన విష యాలను పరిష్కరించారు.

ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే అన్షు తన ఫ్రెండ్స్ తో మంచి ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఫ్యాన్స్ వాటిని లైక్ చేస్తూ సూపర్ అని కామెంట్లు పెడు తున్నారు. ఇక ఏటా అన్షు మాలిక బర్త్ డే పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తల్లి రోజా లాగానే కూతురు అన్షు కూడా ఎంతో అందంగా కనిపిస్తుం ది. అందుకే సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

అయితే ఈమె కూడా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తుందా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అన్షు పుస్తకాల పురుగు. బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలని ఆమ్బిష న్స్ తో ఉంటుంది కాబట్టి ఆమె సినిమాలోకి రాకపోవచ్చు. సెల్వమణి కూడా అన్షును సినిమా రంగానికి దూరంగా ఉంచాలని కోరుకుంటు న్నట్లు తెలుస్తోంది.

అయితే కొడుకు లోహిత్ ను మాత్రం హీరోగా పరి చయం చేయాలని రోజాతో పాటు సెల్వమణి ఆశిస్తున్నట్లు తెలుస్తోం ది. లోహిత్ ఇండియాలోనే చదువు కుంటున్నాడు. తల్లిలాగానే ఇత డు కూడా చాలా మాటకారి. అన్షు మాత్రం చాలా సైలెంట్. మరి వీరి ద్దరిలో సినిమా రంగంలో ఎవరు అడుగు పెడతారో చూడాలి.