High Court notices to sakshi : సాక్షికి హైకోర్టు నోటీసులు
-- పరోక్షoగా సర్కులేషన్ పంచుకునే ప్రయత్నం -- ఒక పత్రిక నే కొనాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ -- సుప్రీం కోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్ పిటిషన్ దాఖలు --మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షికి హైకోర్టు నోటీసులు
— పరోక్షoగా సర్కులేషన్ పంచుకునే ప్రయత్నం
— ఒక పత్రిక నే కొనాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ
— సుప్రీం కోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్ పిటిషన్ దాఖలు
–మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ప్రజా దీవెన/ మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి లకు కోర్టు నోటీసులు (Court notices to AP CM YS Jagan Mohan Reddy’s wife Bharti Reddy) అందాయి.
ఉషోదయ పబ్లికేషన్స్ దాఖలు చేసిన కేసుకు సంబంధించి స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. గతంలో ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు ఎక్కువ రీచ్ ఉండే పత్రికనే కొనాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో( Govt of AP wants to buy the magazine which has more reach) జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు రూ. 200 చొప్పున మంజూరు ( Volunteers and Secretariat staff Rs. 200 per grant) చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి భార్య ఎండీ గా ఉన్న సాక్షి పేపర్ సర్కులేషన్ ను పరోక్షంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉషోదయ పబ్లికేషన్స్ (Ushodaya Publications) అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దీంతో ఈ అంశంపై విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసుని ఏపీ హైకోర్టులో కాకుండా ఢిల్లీ హైకోర్టులో విచారణ ( The Supreme Court will hear this case not in the AP High Court but in the Delhi High Court) చేయాలని ఆదేశాలు ఇవ్వడం తో ఢిల్లీ హైకోర్టు స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా నోటీసులు పంపించింది. సాక్షి ఎండీగా భారతీ రెడ్డికి ఇప్పటికే నోటీసులు అందినట్లు విశ్వసనీయ సమాచారం.