Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 9:58 am Posted by : praja deveena

Highcourt MLAs Defection case : బిగ్ బ్రేకింగ్, పార్టీఫిరాయింపుల కేసులో హైకోర్టు కీలకనిర్ణయం, స్పీకర్, ఎమ్మెల్యేలకు నోటీసులు 

Highcourt MLAs Defection case : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ రాజకీయాల్లో మరోసంచలనo రేకె త్తిం చే అంశం తెరమీదకువచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరా యిo పు అంశంలో ఎట్టకేలకు న్యాయస్థానం రంగంలోకి దిగడం తో కథ మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ మారలేదని చె ప్పుకున్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇప్పుడు తె లంగాణ హైకోర్టు దృష్టి సారించింది. బుధవారం తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుని ఆ ఎమ్మెల్యేలకు, అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పులోఈ ఎమ్మెల్యేలు పార్టీ మార లేదని స్ప ష్టం చేసినప్పటికీ ఆ నిర్ణయంపై అనేక ప్రశ్నలు త లెత్తాయి.ఈ వివాదం వెనుక అసలు కథ ఇంకా రసవత్త రం గా ఉంది. బీఆర్ఎస్ తరఫున దాఖలైన పిటిషన్‌లో, ఎన్నిక ల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లో చేరారని ఆరోపించారు. బహిరంగంగా కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు, వీడి యోలు కూడా కోర్టు ముందుకు తీసుకువచ్చారు. మీడియా మొత్తం ఈ దృశ్యాలతో నిండిపోయిందని పిటిషనర్లు వాదిం చారు.అయితే, స్పీకర్ స్పందన ఆలస్యంగా వచ్చిందని విమ ర్శలు వినిపిస్తున్నాయి.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినా దాదాపు ఏడాది పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటి షన్‌లో పేర్కొన్నారు. చివరికి ఉన్నత న్యాయస్థానాల జో క్యంతోనే స్పీకర్ స్పందించారని కూడా వాదించారు.ఈ రోజు జ రిగిన విచారణలో హైకోర్టు స్పష్టం గా చెప్పిందని, ఎమ్మె ల్యేలు, స్పీకర్ ఇద్దరూ తమ వాదనలు సమర్పిం చాలని అ దే సమయంలో నోటీసులను స్పీడ్ పోస్టు ద్వారా పంపాల ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయి దా వేసింది.

అయితే తాజా హైకోర్టు నోటీసులతో ఇప్పుడు ప్రశ్న ఒకటే న్యాయ స్థానం తుది నిర్ణయం ఏమిటి రాజ కీయ సమీకర ణాలు ఎలామారతాయి తెలంగాణ రాజకీయాల్లో ఈ కే సు మరింత పెద్ద పరిణామాలకు దారి తీసే సూచనలు కనిపిస్తు న్నాయన్న చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.