
Horrific brutal murders in Suryapet district : ప్రజా దీవెన, సూర్యా పేట: చిన్న వివాదం చినికిచినికి గాలి వాన గా మారిచివరకు రక్తపాతానికి దారితీసింది. ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి పర స్పరం గొడ్డళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘట నలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వివాదం ముదరడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగా యి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసు లు రంగంలోకి దిగారు. ఘర్షణను అడ్డుకునే క్రమంలో మేళ్ల చెరువు ఎస్‌ఐ నవీన్ కుమార్‌కు గాయాలయ్యాయి. ఘటన తో తండాలో భయాం దోళన నెలకొనగా పోలీసులు అ ప్రమ త్తమయ్యారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, మృతుల వి వరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పో లీసు లు దర్యాప్తు చేపట్టారు
25 ఏళ్లుగా రగులుతున్న వివాదం
25 ఏళ్లుగా రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఓ చిన్న వివాదం.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలి గొం ది. ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయంలో మొద లైన గొ డవ క్షణాల్లోనే హింసాత్మకంగా మారి.. గొడ్డలి దాడులకు దా రితీసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్ర. గ ట్టు తండాలో శనివారం ఉదయం సుమారు 8 గంటలకు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన భూక్యా పెదబాబు, అతని తమ్ముడు భూక్యా రాము ఇంటి పక్కన ఉన్న వేపచెట్టును కొంతకాలం గా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని సమాచారం. ఈ క్ర మంలో అదే గ్రామానికి చెందిన మందా వెంకటేశ్వర్లు చెట్టు ను తొలగించేందుకు ప్రయత్నిస్తూ దానిని కొడుతున్న సమ యంలో వివాదం చెలరేగింది.అప్పటికే అక్కడికి చేరుకున్న భూక్యా రాము, పెదబాబు ఒక్కసారిగా వెంకటేశ్వర్లుపై గొడ్డ లితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యారు.
ఆపేందుకు వచ్చిన తండ్రిపైనా దాడి
గొడవను ఆపేందుకు ప్రయత్నించిన భూక్యా సైదాపైనా పరి స్థితి అదుపు తప్పడంతో దాడి జరిగినట్లు సమాచారం. సొం త తండ్రి అనే కనికరం లేకుండా పెదబాబు గొడ్డలి, కర్రతో దా డి చేయడంతో సైదా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్ప త్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలోనే సై దా కన్నుమూశారు.ఒకే ఘటనలో ఇద్దరు మృతి చెందడం తో ఎర్రగట్టు తండాలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.
పోలీసులపైకి దూసుకొచ్చిన గ్రామస్తులు
ఇద్దరి మృతికి కారణమైన అన్నదమ్ములపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై దాడి చేసేందుకు గ్రా మస్తులు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్తులను అడ్డుకు నే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో గ్రామస్తులను అదుపు చేసే సమయంలో ఎస్‌ఐ నవీన్‌కుమార్‌కు తలకు గాయం అయినట్లు సమాచారం.
ఘటనాస్థలానికి డీఎస్పీ
ఘటనపై సమాచారం అందుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించా రు. ఘటనకు దారితీసిన కారణాలు, దాడి జరిగిన తీరుపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. 25 ఏళ్లుగా కొన సాగుతున్న వేపచెట్టు వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణా లను బలిగొనడంతో ఎర్రగట్టు తండాలో తీవ్ర విషాదం, ఉద్రిక్తత నెలకొంది.





