Hyderabad Road Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరి ధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇం జనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తు న్న వాహనం ఒకటి అతివేగంతో అ దుపుతప్పి మెట్రోపిల్లర్‌ను బలంగా ఢీకొట్టగా ఈ ఘటన సం భవించింది. ఈ హృదయ విదారక ఘటన లో ఇద్దరు విద్యా ర్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయా లయ్యారు. గాయాలైన వారిలో ముగ్గురు విద్యార్థుల పరి స్థి తి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనపై స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందజేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలు చే పట్టారు. మేడిపల్లి పోలీసులు అందజేసిన సమాచారం ప్రకారం వి ద్యార్థుల కారు అత్యంత వేగంతో ప్ర యాణిస్తోందని, డ్రైవర్ స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడమే ఈ ప్ర మాదానికి ప్రధాన కారణమని తెలిపారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జ య్యింది. వీరంతా ఒకే ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన వారి గా పోలీసులు గుర్తిం చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చే స్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమా చారం. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నా డా, లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విద్యా ర్థుల మృతితో వారి కుటుంబ స భ్యులు కన్నీరుమున్నీరుగా విలిపి స్తున్నారు.