
Horrific Road Accident in Palnadu : ప్రజా దీవెన, ప ల్నాడు: జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్ష ణా ల వ్యవధిలోనే రెం డు భారీ వాహనాలు అగ్నిగోళాలుగా మారాయి. ఈ ఘోర రోడ్డు ప్ర మాదంలో ముగ్గురు వ్యక్తులు క్యాబిన్‌లోనే చిక్కు కుపోయి ప్రాణాలతో విగతజీవులయ్యారు.స్థానిక వివరాల ప్రకారం పల్నాడు జిల్లా బోయపాలెం సమీ పంలో జాతీయ రహ దా రిపై ఒక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో వె నుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో లారీ, ఆగి ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం ప్రమాదం జరిగిన వేగానికి లారీ ఇంధన ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చె ల రేగి భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది.
క్షణాల్లో బూడిదైన ప్రాణాలు
ఢీకొట్టిన లారీ క్యాబిన్ పూర్తిగా నలిగిపోవడంతో, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బయటకు వ చ్చే అవకాశం లేకపో యింది. చూస్తుండగానే మంటలు వాహనం మొత్తాన్ని చు ట్టుముట్టడంతో వారు అక్కడికక్కడే సజీవదహనమయ్యా రు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలో కి దిగి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే వాహనా లు పూర్తిగా అస్థిపంజరాలుగా మారిపోయాయి. హైవేపై ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై ప్రయాణించేటప్పుడు రాత్రి వేళల్లో వాహనాలను నిలిపే వారు తగిన జాగ్రత్తలు (ఇండికేటర్లు/రిఫ్లె క్టర్లు) వాడాలని, వెనుక వచ్చే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హైవే అథారిటీ హెచ్చరిస్తోంది.





