Huge cache of Chinese firecrackers seized : ప్రజా దీ వెన, చెన్నై: చెన్నైపోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చే సిన చైనా బాణాసంచాను డైరె క్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్(DRI) అధికారులు సీజ్ చేశారు. అనుమానా స్పదంగా ఉన్న పలు కంటైనర్లను తనిఖీ చేయగా ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టేషనరీ, మెడికల్ గ్లోవ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, వార్డ్‌రోబ్‌లు,షూ రాక్స్ వంటి వస్తువుల పేర్లతో కం టైనర్లను డిక్లేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే కార్ట న్ల వెనుక భారీ మొత్తంలో చైనా బాణాసంచాను దాచి తరలించినట్లు తనిఖీల్లో బయటపడిం ది.
అనుమతులు లేకుండానే బాణా సంచాను దేశంలోకి తీసు కొ చ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు, సీజ్ చేసిన బాణా సంచా విలువ రూ.12 కోట్లకు పైగానే ఉంటుందని అం చనా వేశా రు. తప్పుడు డిక్లరేషన్ల వెనుక ఉన్న వ్యక్తులు, దిగుమతిదా రు లు, సరఫరా మార్గాలపై డిఆర్ఐ (DRI) అధి కారులు దర్యాప్తు ము మ్మరం చేశారు.చైనా బాణా సంచా అక్ర మ రవాణా వెనుక పని చేస్తున్న స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను గు ర్తించేందుకు అధికారులు ప్రత్యే కంగా దృష్టి సారించారు.
