Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HydarabadDrugsCase : చర్లపల్లి మత్తుకేసులో కీలకమలుపు, కేసుదర్యాప్తులో బయటపడుతోన్న భయానక విషయాలు, లేబుల్స్ మార్చి డ్రగ్స్ సరఫరా

 

HydarabadDrugsCase:  ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ చర్లపల్లిలో సంచలన మత్తు మందుల కేసు కీలక మలుపు తి రిగింది. శనివారం డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయిన విషయం విదితమే. అ యితే కెమికల్ ఫ్యాక్టరీ మాటున భా రీగా డ్రగ్స్ తయారవుతు న్నట్లు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమదాడుల్లో గుర్తించ డం భయాం దోళనలకు గురిచేస్తోంది.

చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ మెఫ్రడీన్ అనే డ్రగ్ ను తయారు చేస్తు న్నట్లు పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో కంపెనీ యజమాని స హా 1 3 మందిని అరెస్ట్ చేసి ముడిసరుకు సీజ్ చేయడం సంచల నంగా మారింది. ఈ కేసులో బంగాదేశీ మహిళ ఫాతిమా చెప్పిన ఆధారాలతో విచారణ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిసినట్లు సమాచారం. చిట్ట చివరకు తీగ లాగి తే డొంకంతా కది లినటైందని తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. ఈ కేసులో కొత్తకోణాలు వెలు గులోకి రావడం ఆశ్చర్యం కలి గిస్తోంది. గురుగ్రామ్ లోని కిమియా బయో సైన్స్ నుంచి వాగ్దేవి ల్యాబ్ కు ముడిసరుకు దిగుమతి అవు తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిపై లేబుల్స్ ను మార్చి సరకు ర వాణా చేసినట్లుగా చెప్తున్నారు. ఎ వ్వరికీ అనుమానం రాకుండా ఉం డేందుకు రోజువారి కూలీలతో పనులు చేయించుకున్నట్లు ద ర్యాప్తులో వెల్లడైందని మహారాష్ట్ర పోలీసు లు వెల్లడించారు. దీంతో ఆ కంపెనీ లో పనిచే సిన కూలీలను విచారణకు రావాల్సిందిగా పో లీసులు ఆదేశించారు.

మహారాష్ట్ర పోలీసుల దాడుల్లో నిన్న సీజ్ చేసిన ముడి సరుకును ముంబైకి తరలించారు. వాసవి ల్యా బ్స్ కు ఇంకా ఎక్కడెక్కడి నుం చి, ఏయే రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తయారీ కై ముడిసరుకు రవాణా జరిగింద న్న దానిపై మహారాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసు లో ముందుముందు సంచలన వి ష యాలు బయటపడే అవకాశం ఉన్నట్లు వెళ్లడవు తోంది. మొత్తానికి హైదరాబాద్ చర్లపల్లి మత్తుమందు కేసు ఎటువై పు మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా నెలకొంది.

పక్కాప్రణాళికలో భాగంగా ఉద్యోగి అవతారం : హైదరాబాద్ చర్ల పల్లి ముంబయి నార్కోటిక్​ పో లీసులు వాగ్దేవీ ల్యాబొరేటరీస్​పై గతకొంతకాలంగానే దృష్టి సారించా రని తెలిసింది. మహారాష్ట్ర పోలీసు ల్లో ఒకరు పక్కా ప్రణాళికతో కార్మి కుడిగా ఈ ల్యాబొరే టరీలో ఉద్యో గo సంపాదించాడు. ఈ క్రమంలో నెల రోజులపాటు ల్యాబోరేటరీలో ఉద్యోగిగా పని చేస్తూ పక్కా సమాచారం సేకరిం చారు. ఈ నేపథ్యం లోనే అనంతరం శనివారం పోలీసు లు దాడి చేసి రూ.కోట్లు విలువ చే సే డ్రగ్స్, ఎండీ డ్రగ్స్​ తయారీకి విని యో గించే 35,500 లీటర్ల ముడి స రుకును స్వాధీనం చేసుకున్నారు. 5.79 కిలోల మెఫిడ్రోన్​, 950 కిలోల పొడి పదార్థం, మిథైలెనెడియా క్సీ మెథాంఫెటమైన్​ను స్వాధీనం చేసుకోవడం కొసమెరుపు.

డ్రగ్స్ కేసు కథాకమీషు ఇలా... మహారాష్ట్రలోని మిరా భయాందా ర్, వసాయ్​ విరార్ కమిషనరేట్​ పో లీసులు ఆగస్టు 8న ఓ మహిళ నుం చి 105 గ్రాముల మెఫిడ్రిన్​ను స్వా ధీనం చేసుకున్నట్లు కొత్త కోణంలో వెలుగు చూసిన సమాచారం. కాగా నిందితురాలు బం గ్లాదేశ్​కు చెందిన ఫాతిమా మురాద్​ షేక్​ అలియాస్​ మొల్లా (23)గా గుర్తించిన పోలీ సులు ఆమెను విచారించి కొత్తకొత్త విషయాలను రాబట్టారు.సదరు మహిళా నిందితురాలిచ్చిన సమాచారంతో ఈ మహమ్మారి కే సులో మరో 10 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచిరూ. 23.97 లక్ష ల విలువైన 178 గ్రా ముల మెఫిడ్రిన్ ఫోన్లు, కార్లు స్వా ధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​ చర్లపల్లిలోని ఓ పరిశ్ర మ నుంచి డ్రగ్స్​ వస్తున్నట్లు నిం దితులు విచారణలో వెల్లడించారు. ఈ క్రమంలోనే మిరా భయాం దార్​, వసాయ్ విరార్​ నేర పరిశోధన వి భాగం-4 ఇన్​స్పెక్టర్​ ప్రమో ద్​ బృందం రెండు రోజుల క్రితం హైదరాబా ద్​ నగరానికి వచ్చింది. చర్లపల్లి ఫేజ్​-5 లోని నవోదయ కాలనీలో వాగ్దేవి ల్యాబొరేటరీస్​పై ఆకస్మిక దాడి చే యగా డ్రగ్స్ తయారీ యూనిట్​ బ యటపడింది. దీని యజమాని వో లేటి శ్రీనివాస్​ విజయ్, ఇతని సహా యకుడు తానాజీ పండరీనాథ్​ ప ట్వారీలను పోలీసులు అరెస్టు చేశా రు. కోర్టులో ట్రాన్సిట్​ వారెంట్ తీసు కుని ముంబయికి తీసుకు వెళ్లారు.

రాంనగర్​ గుండు ప్రాంతానికి చెందిన వోలేటి శ్రీనివాస్​ విజయ్ ఓ ప్ర ముఖ ఫార్మా కంపెనీలో పనిచేశా డు. చర్లపల్లి నవోదయకాలనీలో జలంధర్​ రెడ్డికి చెందిన భవనాన్ని నాలుగేళ్ల క్రితం లీజుకు తీసు కున్నాడు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి ఫా ర్మా ఉత్ప త్తులు పెట్టాడు. మహారాష్ట్రతో పా టు దేశ వ్యాప్తంగా ఈ డ్రగ్స్​ను సర ఫరా చేస్తున్నట్లు మిరా ఖయాందార్​వసాయ్ విరార్​ పోలీసు కమిషనర్​ నిఖేష్​ కౌశిక్​ మీడియాకు వెల్లడించా రు. వీరికి విదేశీ లింకులున్నట్లు స మాచారం ఉందని దీనిపై మరింత లోతు గా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.