Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 10:12 am Posted by : praja deveena

Hyderabad cricket association SIT : బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణయం, ది ‘హెచ్‌సీఏ’ ఫైల్స్ పై ‘సిట్’

 

Hyderabad cricket association SIT :  ప్రజా దీవెన, హైదరాబాద్: మైదా నంలో ఫోర్లు, సిక్సర్ల కంటే తెరవె నుక జరిగిన ‘ఆర్థిక’ హిట్లు, వికెట్ల పతనాలు ఇప్పుడు హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ను కుదిపేస్తున్నాయి. ని న్నటివరకు వి లాసవంతమైన కార్లు, వీఐపీ బాక్సులకే పరి మితమైన హెచ్‌సీఏ లీలలు, ఇప్పుడు ‘సిట్’ (Special Inv estigation Team) ముంగిట క్లీన్ బౌల్డ్ అయ్యేందుకు సి ద్ధంగా ఉన్నాయి. హెచ్‌సీఏ చుట్టూ ముసురుకున్న అక్రమా ల చీకట్లను ఛే దించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా ‘సిట్’ ను రంగం లోకి దించింది. క్రికెట్ బోర్డులో ఇ న్నా ళ్లూ సాగిన ‘సిండికేట్’ సామ్రా జ్యానికి ఇక ఎండ్ కార్డ్ పడబో తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే హెచ్‌సీఏపై నమోదైన నాలుగు కీలక కేసులను త క్షణమే సిట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఇది కేవలం పాత కే సుల దుమ్ముదులపడం మాత్రమే కాదు తాజాగా వెలుగులోకి వచ్చి న సరికొత్త స్కామ్‌లపై కూడా‘ సిట్’ థర్డ్ ఐ ఓపెన్ చేయబోతోంది. గతం లో జరిగిన తప్పు లతో పాటు, ప్రస్తుతం తెరవెనుక సాగుతున్న ప్రతి అ డుగు నూ ఈ స్పెషల్ టీమ్ జల్లెడపట్టనుంది.బీసీసీఐ (BC CI) నుంచి హైదరా బాద్ క్రికెట్ అభివృద్ధి కోసం, మౌలిక వస తు ల కోసం వచ్చిన కోట్ల రూపాయల నిధులు.. అసలు లబ్ధి దా రులైన యువ క్రికెటర్లకు చేరకుండా, కొందరి జేబుల్లోకి ఎలా మళ్లా యనే ‘రూట్ మ్యాప్’ పైనే ఇప్పుడు సిట్ ప్రధా నంగా ఫోకస్ పెట్టింది. దీనిపై గతంలోనే గట్టి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే.

  వికెట్లు పడ్డాయి, ఇక మ్యాచ్ సిట్ చేతిలో

ఈపిచ్‌పై ఇప్పటికే ఒక బిగ్ వికెట్ పతనం జరిగింది. నిధుల దుర్విని యోగం, అధికార దుర్వినియోగం ఆరోపణలపై హె చ్‌సీఏ ప్రెసిడెంట్ (అధ్యక్షుడు), సెక్రటరీ (కార్యదర్శి) లను సీ ఐడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చారు. ఇప్పుడు కేసు సిట్ చేతికి రావ డంతో కేవలం ఈ ఇ ద్దరేనా, లేక వీ రి వెనుక ఉన్న ‘బిగ్ బాస్‌లు’ ఎవ రు డ్రెస్సింగ్ రూమ్స్ నుండి కార్పొ రేట్ బాక్స్ ల వరకు సాగిన ఈ ‘ఫి క్సిం గ్’ కథలో ఇంకా ఎవరెవరి పా త్రలు ఉన్నాయి? అనేది తే లాల్సి ఉంది. రాబోయే రోజుల్లో సిట్ విచారణతో హైదరా బాద్ క్రికెట్ అ సోసియేషన్‌లో మరిన్ని సంచలన నిజాలు బయటకు రావడం ఖా యంగా కనిపిస్తోంది. క్రికెట్ లవర్స్ అందరూ ఇప్పుడు లైవ్ మ్యాచ్ కం టే.. ఈ ‘సిట్’ ఇన్వెస్టిగే షన్ అప్‌డే ట్స్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.