
HYDRAA Commissioner Ranganath : ప్రజా దీవెన, హైదరాబాద్: హై ద రాబాద్ శరవేగంగా మారుతోంది. కానీ ఆ మార్పు వెనుక జరుగు తున్న ఐఏఎస్ వర్సెస్ జ్యుడీషి యరీ మహా సంగ్రామం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్ర తిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థకు అతిపెద్ద న్యాయపర మైన భూకంపం సంభవించింది. విధి నిర్వహణలో పరిమి తులు దాటారన్న తీవ్ర ఆగ్రహంతో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ని తెలంగాణ హైకోర్టు ఆదే శించింది. న్యాయస్థానం మొత్తం గా 63 సార్లు హెచ్చ రించినా మారలేదా?న్యాయస్థానం వ్యాఖ్యానించిన తీరు ఐఏఎస్ వర్గాల్లో తీ వ్ర కలకలం రేపుతోంది. ఒకటా రెండా ఏ కంగా 63 సార్లు కోర్టు ఆ దేశాలను ధిక్కరించారంటూ ధ ర్మా సనం తీవ్ర స్థాయిలో మండి పడింది.
అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్‌ను అరెస్ట్ చే యిస్తామని తెలంగాణ హైకోర్టు ఘాటు హెచ్చరికలు జారీ వే సింది.ఆయన స్థానంలో చట్టం, నియ మావళి పట్ల పూర్తి అ వగాహన, అర్హత ఉన్న మరొక సమర్థుడైన అధికారిని తక్ష ణమే నియమిం చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆగ్రహానికి అసలు కారణం ఇదే
చెరువుల పరిరక్షణ, ఆక్రమణల ఉక్కుపాదం పేరుతో ప్రారం భమైన హైడ్రా, క్రమంగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను వి స్మరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.నోటీసులు లేవు, ముందస్తు స మాచారం లేదు, స్టే ఉత్తర్వులు అమలులో ఉ న్నప్పటికీ, బాధితు లకు ఎలాంటి నోటీసులు ఇవ్వ కుండా ప్రైవేటు ఆస్తుల చుట్టూ కంచెలు వేయడం, కూల్చివేతలకు దిగడo వంటి చర్యలకు పాల్పడడం కారణాలుగా చెబుతోం ది.
సహజ న్యాయసూత్రాలకు తిలోదకాలు
ఆక్రమణదారులపై చర్యలు ఎం త అవసరమో, చట్టబద్ధమై న పద్ధతిని పాటించడం కూడా అంతే ముఖ్యమని కోర్టు స్ప ష్టం చేసింది.అధికార మదంతో చట్టాన్ని చేతుల్లోకి తీసు కుం టే ఎంతటి ఉన్నతాధికారినైనా బోనులో నిలబె డతామని న్యాయస్థానం ఘాటు హెచ్చరిక జారీ చేసింది.ఒకవైపు చెరు వులు, ప్రభుత్వ భూములను కాపాడుతున్నామన్న పేరు తో ప్రభుత్వం పొందుతున్న మైలేజ్… మరోవైపు ‘చట్ట నిబం ధ నలను ఉల్లంఘిస్తున్నారు’ అన్న న్యాయస్థానపు చురకల తో ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. చట్ట పరిమితులు దాటి ముందుకెళ్తే, ఇది చివరకు ప్రభుత్వ విశ్వసనీయతకే పెద్దదెబ్బగా మారే అవకాశం ఉందని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైడ్రా భవితవ్యం ఏమిటి?
ఆక్రమణలపై సమరం అవసరమే కానీ, అది ప్రజానుకూలం గా, చట్టబద్ధంగా జరిగినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థకు ప్రజ ల్లో విలువ ఉంటుంది.రెవెన్యూ, మున్సిపల్ పరిధులపై పూ ర్తి స్పష్టత ఉండాలి.ప్రతి చర్యకూ ముందస్తు నోటీసులు, పా రదర్శకత తప్పనిసరి.న్యాయస్థానాల ఆదేశాలను తుచ త ప్పకుండా పాటించాలి. లేక పోతే..చెరువులను కాపాడే వీ రుడిగా మారాల్సిన ‘హైడ్రా’, రాజ కీయ వేధింపుల సాధనం గా, చట్టాన్ని అతిక్రమించే వ్యవస్థగా ముద్రపడి చరిత్రలో మి గిలిపో యే ప్రమాదం ఉందన్న చర్చోపచర్చలు కొనసాగు తూనేఉన్నాయి.





