IASILAThipathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మికతనిఖీ, యూరియాను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ కేసులు
IASILAThipathi : ప్రజాదీవెన, నల్లగొండ: సబ్సిడీ యూరియా ను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు సంయుక్తంగా హె చ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలు నల్గొండ జిల్లా, హైద రాబాద్-విజయవాడ రహదారిపై వెలిమినేడ్ వద్ద ఉన్న యాడ్ బ్లూ , డిఇఎఫ్ సేల్ కౌంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ డిఇ ఎఫ్ లో కలుపుతున్న యూరియా ఎలా వస్తుందో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలని, అలా కాకుండా ఇతర పనులకు వాడవద్దని, ఇండస్ట్రీలకు ఇండస్ట్రీ యూ రియానే వాడాలని అన్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘాలు, రైతు సేవ కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎరువులను ప్రత్యే కించి యూరియాను దారి మళ్లిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ సబ్సిడీ యూరియాను రైతులు మాత్రమే వాడాలని, అలా కాకుండా పరిశ్రమలకు మళ్లించ కూడదని,ఏదైనా పరిశ్రమ సబ్సిడీ యూరియాను వాడితే చట్ట పరం గా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. యూరియాను వాడే అనుమానాస్పద ఇండస్ట్రీలన్నిం టిపై పూర్తిస్థాయిలో తనిఖీ చేసి ఇండస్ట్రియల్ యూరియా కాకుం డా, సబ్సిడీ యూరియాను వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమిన ల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విష యం లో జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారని, అంతేకాక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా చిట్యాల ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల స్టాకును పరిశీ లించారు. రికార్డులన్నిటిని సక్రమంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థి తులలో ఎరువులు దుర్వినియోగం కారాదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత సీఈఓ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, చిట్యాల తహసిల్దార్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి గిరిబాబు, తదితరులు ఉన్నారు.