Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

If they are fooled by KCR’s words, they will shout: కేసీఆర్ మాటలకు మోసపోతే గోసపడతారు

దత్తత నల్లగొండకు ఎలాంటి అభివృద్ధి ఒరగబెట్టలేదు -- ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేసీఆర్ మాటలకు మోసపోతే గోసపడతారు

దత్తత నల్లగొండకు ఎలాంటి అభివృద్ధి ఒరగబెట్టలేదు
— ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/నల్లగొండ: సీఎం కేసీఆర్ మరోసారి వచ్చి నల్లగొండ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ మాటలకు మరోసారి మోసపోతే గోస పడతామని హితవుపలికారు. శుక్రవారం నల్లగొండలోని 35, 36 , 37వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుంటే తాను కూడా సంతోషపడ్డానని, కానీ దత్తత పేరుతో ఎన్నికలలో లబ్ధి పొంది నల్లగొండను ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

ఒక్క రోడ్డు వేసి నల్లగొండను అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. నల్లగొండ నియోజక వర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని వివరించారు. గుంతలు పడిన రోడ్లకు మట్టి పోసిన దాఖలాలు కూడా లేవని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి పేద ప్రజలను వంచనకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీములను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వంలో తాను ఏ స్థాయిలో ఉన్న నల్లగొండ అభివృద్దే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వo వస్తే పార్టీల తో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో తనకు అండగా ఉండి గెలిపిస్తే వారి కష్టసుఖాలలో పాలుపంచు కుంటానన్నారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్, నాయకులు ఇటికాల శ్రీనివాస్, మొరిశెట్టి నాగేశ్వరరావు, నంద్యాల బ్రహ్మానందరెడ్డి, అవుట రవీందర్, ఇటికాల శ్రీకాంత్, సురిగి మారయ్య సూరెడ్డి సరస్వతి, పాదూరి మోహన్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, సుజాత, పుట్ట వెంకన్న, గడ్డం భరత్ ,గూడశివ, నాంపల్లి భాగ్య తదితరులు పాల్గొన్నారు