OpinionPoliticsక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Illegal Industrial Chemical Trade : బిగ్ బ్రేకింగ్, జాతీయ రహదారిపై పారిశ్రామిక రసాయనాల అక్రమ దందా గుట్టురట్టు, 5గురు నింది తుల అరెస్ట్ 

Illegal Industrial Chemical Trade : ప్రజా దీవెన, చి ట్యాల: చిట్యాల పరిధిలోని జాతీయ రహదారి -65 వేదికగా సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర కెమికల్ దారిమళ్లింపు రాకెట్‌ ను చిట్యాల పోలీసు లు పక్కా సమాచారంతో ఛేదించారు. రసాయన ట్యాంకర్ల నుం చి కెమికల్స్‌ను అక్రమంగా దొంగి లించి, అధిక ధరలకు విక్రయిస్తు న్న 5 మంది సభ్యుల ము ఠాను అదుపులోకి తీసుకున్నారు. వెలి మినేడు శివారులోని రాజస్థాన్ ధాబా వెనుక పార్కింగ్ ఏరియా ను అడ్డాగా చేసు కుని ఈ దందా సాగుతోందని విచారణలో వెళ్లడైంది.

ప్రధాన నిందితుడు చాపల సత్య నారాయణ (సతీష్) ఇత ర రా ష్ట్రాల నుంచి వచ్చే ట్యాంకర్ డ్రై వర్లతో కుమ్మక్కై, గ మ్యస్థానాల కు చేరాల్సిన సాల్వెంట్లు, ఐసో ప్రొపైల్ ఆల్క హాల్, మిథనాల్ వంటి రసాయనాలను మార్గమ ధ్యలోనే తక్కువ ధరకు కొను గోలు చేసేవాడు. దొంగిలించిన ర సా యనాలను పైపుల ద్వారా ప్లా స్టిక్ డ్రమ్ములలోకి నింపి, ప్ర త్యేక వాహనాల్లో హైదరాబాద్ తదితర మార్కెట్లకు తరలిం చి భారీ లాభాలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చాపల సత్య నారాయణ @ సతీష్ (32), ప్ర ధాన సూత్రధారి కాగా ఉత్తరప్ర దే శ్ కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ లు బిపిన్ కుమా ర్ యాదవ్(35), నవీన్ కుమార్ (31), చిట్యాల ప్రాంతానికి చెందిన కూలీలు రా కేష్ ప్రసాద్ (45),అమిత్ కుమార్ (36) ను అరెస్ట్ చేసి రెండు ట్యాంకర్లు ( MH-42-AQ-6795, M H-04-LY-8397), రవాణా వాహనాలైన బొలెరోలు (TS-07 -UN-1565, TS-07-UM-0 62 6), మినీ DCM (TS-10-UC- 4845) లతో పాటు కెమికల్స్‌తో నిండిన ప్లాస్టిక్ డ్రమ్ము లు, పంపిం గ్ పైపులు, ఇన్వాయిస్ రికార్డులు తదితర సా మాగ్రి స్వాధీన పరుచుకున్నారు.

పరిశ్రమలకు భారీగా ఆర్థిక నష్టం కలిగిస్తున్న ఈ ముఠాపై కేసు న మోదు చేసి నిందితులను న్యా యస్థానంలో హాజరు పరచగా, గౌరవ కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఈ నెట్‌వ ర్క్‌తో సం బంధమున్న ఇతర వ్యక్తుల కోసం దర్యాప్తు వేగ వంతం చేశామని నార్కెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెల్లడిం చారు.

Related Articles

Back to top button