Legislative Council Building : ప్రజా దీవెన, హైదరాబా ద్ : హైదరాబాద్ చారిత్రక శాసనసభ ప్రాంగణం ఆ రోజు ప్రత్యేక కాంతు లతో మెరిసిపోయింది. ఎన్నో సంవ త్సరాల చరిత్రను మోస్తున్న ఆ ప్రదేశంలో పునరుద్ధరించిన శాసన మండలి భవనం కొత్త రూపంతో ప్రజల ముందుకొచ్చింది. ఆ గౌరవ క్షణానికి సాక్షిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భవనాన్ని ప్రారంభించారు.భవన ద్వా రం వద్ద సంప్రదాయ వే ద మంత్రాల నడుమ ఫీతాను కత్తి రించిన ముఖ్యమంత్రి, కొత్తగా రూపుదిద్దుకున్న మండలి భ వనంలో అడుగుపెట్టారు. ఆయన వెంట శాసనమండలి చై ర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మార్, మండలి డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
ఆ క్షణం కేవలం ఒక భవనం ప్రారంభం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు అనిపించింది. పూజా కార్యక్రమాల మధ్య ముఖ్యమంత్రి మండలి కా ర్యాలయంలో ప్రత్యేకంగా పూజ లు నిర్వహించి, ప్రజల సంక్షేమానికి ఈ వేదిక మరింత బల పడాలని ప్రార్థించారు.ఈ వేడుకలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర రా జనర్సింహ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీ నివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకట స్వామి మహమ్మ ద్ అజారుద్దీన్ పాల్గొన్నారు.
అలాగే ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ చారిత్రక క్షణాన్ని ప్రత్య క్షంగా వీక్షించారు. కొత్తగా పునరుద్ధరించబడిన మండలి భ వనం ఇకపై తెలంగాణ ప్రజా స్వామ్య చర్చలకు, కీలక నిర్ణ యాలకు కేంద్రంగా నిలవబోతోందని అందరూ విశ్వాసం వ్య క్తం చేశారు. చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తును నిర్మిం చే ఈ మండలి భవనo తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి నాందిపలకింది.
చారిత్రాత్మకప్రజాహిత నిర్ణయాలకు వేదికకావాలి
శాసనమండలి పునరుద్ధరణ భవనం ప్రారంభోత్సవ సంద ర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగా ణ పునర్నిర్మాణం దిశగా జరుగుతున్న ఈ చారిత్రక ఘట్టం లో భాగస్వామ్యం కావ డం ఎంతో గర్వకారణమని తెలి పా రు. ముఖ్యంగా ఆర్ & బీ శాఖ మంత్రిగా ఈ భవన పునరు ద్ధరణ పనులను పర్యవేక్షించడం తనకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
శాసనసభ మరియు శాసనమం డలి అనే రెండు సభలు పూర్తి సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం ల భిస్తుందని ప్రజా ప్రభుత్వం బలంగా నమ్ముతుందని మంత్రి చెప్పారు. ఈ పునరుద్ధరించిన భ వనం రాబోయే కాలంలో అర్థవంతమైన మేధోమథనాలకు, చారిత్రాత్మక ప్రజాహిత నిర్ణయాలకు వేదిక కావాలని ఆకాం క్షించారు.పెద్దల సభ అయిన శాసనమండలికి నూతన శోభ ను చేకూర్చడం ద్వారా పార్లమెంటరీ విలువల పట్ల ప్రభు త్వానికి ఉన్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకు న్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

