Universities vice chancellors : విశ్వ విద్యాలయాలకు ఇంచార్జీ విసిలు
తెలంగాణలోని పది ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో ఇన్చార్జి విసి లను నియమించింది ప్రభుత్వం.
పది యూనివర్సిటీలకు ఐఎఎస్ ల నియామకం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలోని పది ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో ఇన్చార్జి విసి లను(Universities vice chancellors ) నియమించింది ప్రభుత్వం. కొత్త వీసీల నియామ కానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఓయూ, కాకతీయ, జేఎన్‌టీయూ(JNTU), శాత వాహన, మహాత్మాగాంధీ, తెలం గాణ, పాలమూరు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar open university), తెలుగు యూనివర్సిటీ, జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సి టీల ఇన్ ఛార్జీ వైస్ ఛాన్సలర్స్ లను నియమిస్తూ ప్రభుత్వం మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. సినియర్ ఐఎఎస్ లను ఇన్చార్జి విసి లుగా నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిషోర్, జేఎన్టీయూ కి బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీ(Ambedkar open university) కి రిజ్వి, తెలంగాణవర్సిటీకి సందీప్ సుల్తానియా,పొట్టి శ్రీరాము లు తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నవీన్ మిట్టల్ శాతవాహన యూనివర్సిటీకి సురేంద్ర మోహన్,పాలమూరు యూనివర్సిటీకి నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్ లను నియమిం చారు.
Incharge of Universities is vice chancellors