InchargeMinisterAdlurilaxman : నల్లగొండ జిల్లాఇంచార్జ్ మంత్రి లక్ష్మణ్ హామీ, అల్పసంఖ్యాకవర్గాల ప్రజల సంక్షేమానికి అధిక నిధులు
InchargeMinisterAdlurilaxman: ప్రజాదీవెన దేవరకొం డ: దేవరకొండ నియోజకవర్గoలో షె డ్యూల్డ్ కులాలు, తెగలు, అ ల్పసం ఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి త న నవంతుగా ఎక్కువ నిధులు అం దించి సహకరిస్తానని, రాష్ట్ర ఎ స్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలి పారు. దేవరకొండ నియో జక వర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభి వృ ద్ధికి, రోడ్ల అభివృద్ధి ,ఎస్ సి,ఎ స్ టి సబ్ ప్లాన్ నిధులు కేటా యిం చి తన వంతు స హకారాన్ని అందిస్తానని మంత్రి చెప్పారు. ఆదివా రం అయన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేశారు.
గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, అలాంటిది తమ ప్రభు త్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అ ర్హులైన ప్రతి పే దవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నదని, అంతే కాక ధనవంతులతో సమానంగా స న్న బియ్యం ఇస్తున్నామ ని, 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామ ని, ఉచిత బస్సు ప్రయాణం, 60 వేల మందికి ఉద్యో గాలు ఇచ్చామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చే సిన ఘనత తమదేనన్నారు. తమ ప్రభు త్వం ఎస్సీ వర్గీకరణతో పా టు, 42 శాతం బీసీ రిజర్వేషన్ కు సిఫారసు చేయడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అలు చేస్తున్న కార్యక్రమా లు పేదలకే చేరాలని తెలిపారు. తన మం త్రిత్వ శాఖల ద్వారా త ప్పనిసరిగా దేవర కొండకు ఎక్కువ నిధుల ను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి పునరుద్గాటించారు.
స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చే స్తున్నదని, అందులో భాగంగానే దే వరకొండ నియోజకవర్గం లో ఇప్ప టివరకు కొత్తగా 11736 కొత్త రేష న్ కార్డులను ఇవ్వడం జరి గిందని, అంతేకాక రేషన్ కార్డులలో 15837 మందిని సభ్యులుగా చేర్చి వారంద రికీ సన్నబియ్యాన్ని ఇవ్వనున్నా మ ని చెప్పారు.ప్రతి ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు రేషన్ కార్డు అవస ర మని ,గత పది సంవత్సరాలలో ప్ర భుత్వం రేషన్ కార్డులివ్వనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజ లకు ఇచ్చిన వాగ్దానాల మేరకు తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపా యల రైతు భరోసాని ఇచ్చిందని, రుణమాఫీలో భాగంగా దేవరకొం డ నియోజకవర్గం లో 360 కోట్ల రూ పాయల రుణమాఫీ చేశామ ని, అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యమిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజె క్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇతర నియోజ కవర్గాలతో సమానంగా దేవరకొండను అభివృద్ధి చేస్తానని తెలిపా రు. దేవరకొండ నియోజకవర్గానికి ఎస్సీ, ఎ స్టీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎక్కువ నిధులు కేటాయించాలని, రహదారులు లేని తండాలకు రహదారులకు ని ధులు మంజూరు చేయాలని, మైదాన ప్రాంతంలో ఐటిఏ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
శాసనమండలి సభ్యులు శంకరనా యక్ మాట్లాడుతూ తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక 1800 కోట్ల రూపాయలతో డిండి ప్రాజె క్టు ను చేపట్టడం జరిగిందని, గత ప్ర భుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టిం చుకోలేదని, దేవరకొండ సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తా మని, భూ భారతి, బిసి కులగనన, చేప ట్టామని, దేవరకొండ లాం టి వెను కబడిన ప్రాంతం అభివృద్ధికి అంద రూ సహకారం అం దిం చాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రేషన్ కార్డు నిరంతర ప్రక్రి య అని, అయితే చనిపోయిన వా రి పేర్లను రేషన్ కార్డులో నుండి తొ లగించే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పాలని కోరా రు. సన్న బియ్యం పంపిణీ విష యంలో చౌకధర దుకాణా డీలర్లు పారదర్శకంగా ఉండాలని ,ఈ విష యంలో ఎలాంటి ఆరోపణలున్న త మ దృష్టికి తీసుకురావాలని ప్రజల తో కోరారు. అన్ని ప్రభుత్వ పథకా లు పొందేందుకు ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని పొందేందు కు రేషన్ కార్డు తప్పనిసరి అని అ న్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 62155 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, అంతేకాక 80201 మందిని రేషన్ కార్డులలో కొత్తగా సభ్యులుగా చేర్చ డం జరిగిందని తెలిపారు.రాష్ట్ర ప్ర భుత్వం భూసమస్యల పరిష్కా రా నికి భూ భారతి చట్టాన్ని తీసు కొ చ్చిందని, అటవీ భూముల సర్వే త దితరాల వల్ల భూ సమస్యలు తీరే అవకాశం ఉందని తెలిపారు.
దేవరకొండ ఆర్ డి ఓ రమణ రెడ్డి మాట్లాడారు.జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, గృహ ని ర్మా ణ శాఖ పీడి రాజకుమార్, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ జి ల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సాం ఘిక సంక్షేమ శాఖ డి డి శైలజ , మా జీ పిఎసిఎస్ చైర్మన్ లు మార్కెట్ క మిటీ చైర్మన్ లు సర్పంచులు తది తరులు పాల్గొన్నారు. అంతకుముం దు సమాచార శాఖ ఆధ్వర్యంలో తె లంగాణ సాంస్కృతిక సారథి కళా కారులు వివిధ ప్రభుత్వ పథకాలపై ఇచ్చిన ప్రదర్శన ఆహుతులను ఆక ట్టుకుంది.