Indhiramma houses: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సొం తింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల అని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం న ల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య దంపతులు నూతనంగా నిర్మిం చుకున్న ఇందిరమ్మ ఇంటిని పిడి రాజ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పా ర్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇంది ర మ్మ ఇంటిని త్వరితగతిన పూర్తి చేసుకున్నందు కు ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులం తా సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చే స్తే వారికి బిల్లు కూడా త్వ రగా వస్తుందన్నారు. 14వ వార్డులో మం జూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణా లను వేగవంతం చేయాలని కోరారు. అర్హులైన వారం ద రికీ ఇందిర మ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలి పారు.
నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి సహకారంతో 14వ వార్డులో ని మర్రిగూడ అభివృద్ధికి అన్ని విధా లుగా కృషి చేస్తా న న్నారు. పార్టీల క తీతంగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు మం జూ రు అవుతాయని తెలిపారు.
ఇప్పటివరకు మంజూరైన ఇందిర మ్మ ఇండ్లు మొత్తం పూర్తి అయి తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పండుగ వా తా వరణం లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించడం జరుగుతుందని తె లిపారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ తీసు కున్న వారంతా తప్ప ని సరిగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేంతవరకు తమ వంతు సహకారం అందించాలని అన్నారు.మర్రిగూడలో కొన్ని కాల నీలలో మిగిలి ఉన్న సిసి రోడ్లను వేయిస్తానని అన్నారు. అదేవిధంగా 14వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనే జీ పనులను ప్రారంభించి మర్రిగూడ అభివృద్ధికి అన్ని విధాలుగా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశా రు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు,మాజీ కౌన్సిలర్ బొజ్జ శంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అ ధ్యక్షుడు గురిజ వెంకన్న, కాం గ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, నాగిరెడ్డి, జాన్ రెడ్డి, సుంకరబోయిన మధు, మర్రి సత్తయ్య, సాయి, వినేష్, వెం కన్న,సైదులు, ఇస్తారి, రాములు, సుధాకర్, రవి, సైదులు, మహేంద ర్, చిరంజీవి, ఎల్లేష్, లక్ష్మీనారి తది తరులు పాల్గొన్నారు.
