Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 6:47 am Posted by : praja deveena

Indian filmmaker K. Bhagyaraj passed away : బిగ్ బ్రేకింగ్, చిత్ర పరిశ్రమలో ఒకశకం ముగిసింది, స్క్రీన్‌ప్లే రారాజు ‘భాగ్యరాజ్’ ఇక లేరు

 

Indian filmmaker K. Bhagyaraj passed away :  ప్ర జా దీవెన, చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ద క్షిణ భారత సినిమా రంగాన్ని తన విల క్షణమైన కథలు, స్క్రీన్‌ప్లేతో ఉర్రూ తలూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్ర ముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (74) కన్నుమూశా రు. శనివారం తెల్లవారుజామున ఆయనకు తీవ్ర గుండెపో టు రావడంతో తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త విన్న సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

సినిమా ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒ క్క క్రాఫ్ట్‌పై పట్టు సాధిం చడమే కష్టం. కానీ భాగ్యరాజ్ అలా కాదు ఆయన ఒకేసారి నటుడి గా, దర్శ కుడిగా, అద్భుతమైన రైటర్‌గా, స్వరకర్తగా, నిర్మాత గా ప్రతి విభా గంలోనూ తన ముద్ర వేసి ‘ఆల్‌రౌం డ ర్’ అ ని పించుకున్నారు. అందుకే భారతీయ సినిమా రంగం లో ఆయనను అందరూ ప్రేమగా ‘కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే’ అని పి లుచు కునే వారు.ట్విస్టులతో, సున్నితమైన హాస్యంతో, భా వోద్వే గాలతో ఆయన రాసే స్క్రీన్‌ప్లే ఒక పర్ఫెక్ట్ టెక్స్ట్‌ బుక్ లాం టిదని సమకాలీన దర్శకులు సైతం కొనియాడుతుం టారు.

తెలుగు సినిమాతో విడదీయరాని బంధం

భాగ్యరాజ్ నేరుగా తమిళంలో సిని మాలు తీసినా, ఆయన కథలు తె లుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచి తమే. ఆయన తెలుగులో నేరుగా విక్టరీ వెంకటేష్ హీరోగా ‘పెళ్లైంది కా నీ..’ అనే చిత్రానికి దర్శకత్వం వ హించారు.టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్ హిట్టయిన ఈవీవీ సత్యనారా య ణ – వెంకటేష్‌ల ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ అలాగే దా సరి నారాయణరావు – కృష్ణల ‘అ బ్బాయిగారు’ చిత్రాలకు మూ లక థ, స్క్రిప్ట్ భాగ్యరాజ్ అందించినవే కావడం విశే షం.”కథలో బలం ఉం టే థియేటర్ కి ప్రేక్షకుడు ఎలా వ స్తా డో తన సినిమాల ద్వారా నిరూ పించిన మేధావి భాగ్య రాజ్. ఆయ న మరణం సినిమా రంగానికి తీర ని లోటుగా సినీ పరిశ్రమ పేర్కొంది.

ఆయన మృతి పట్ల కోలీవుడ్, టా లీవుడ్‌కు చెందిన పలు వురు ప్ర ముఖులు, నటీనటులు తీవ్ర సo తాపాన్ని ప్రకటి స్తూ ఆయన కు టుంబ సభ్యులకు తమ గాఢ సా నుభూ తిని తెలియజేస్తున్నారు. క థల రూపంలో ఆయన ఎప్పటికీ సి నిమా ప్రేమికుల గుండెల్లో జీవించే ఉంటారని సినీ ప్ర ముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.