Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Inter board in a state of confusion అయోమయ స్థితిలో ఇంటర్ బోర్డు

ఎన్నడూ లేనంతగా తగ్గిన కొత్త చేరికలు

అయోమయ స్థితిలో ఇంటర్ బోర్డు

ఎన్నడూ లేనంతగా తగ్గిన కొత్త చేరికలు

ప్రజా దీవెన / హైదరాబాద్‌: గతంమెన్నడూ లేనంతగా ఈదఫా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు(admissions) తగ్గడంతో బోర్డు అధికారులు తలపట్టుకుంటున్నారు.ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గడం ఇంటర్‌ బోర్డులో తీవ్ర చర్చకు దారితీసి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ (intermidiat) అడ్మిషన్లు సగానికి సగం తగ్గాయంటూ అంటూ చర్చోపచర్చలు చక్కర్లు కొడుతున్నాయి.

కాలేజీలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి బోధన ప్రారంభo కాకపోవడం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరుగక పోవడం, సబ్జెక్టులను బోధించడానికి ఉద్దేశించిన సుమారు 2 వేల మంది గెస్ట్‌ లెక్చరర్ల నియామకం పూర్తి కాకపోవడం వంటి అనేక కారణాలతో అడ్మిషన్ లు తగ్గాయన్న అభిప్రాయానికి వచ్చారు.

కాలేజీల్లో (Colleges) అడ్మిషన్ లు పెంచడానికి  కాలేజీ సిబ్బంది ప్రస్తుత విద్యా సంవత్సరం లో చెప్పుకోతగ్గట్టుగా ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీని కారణంగానే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పడిపోయన్న విషయం ఆ నోట ఈ నోట పడింది.