Invitation for NABARD jobs : నాబార్డ్ లో ఉద్యోగాలకు ఆహ్వానం
-- అన్ లైన్ లో దరఖాస్తులకు ఈ నెల 23వ తేదీ చివరి గడువు
నాబార్డ్ లో ఉద్యోగాలకు ఆహ్వానం
— అన్ లైన్ లో దరఖాస్తులకు ఈ నెల 23వ తేదీ చివరి గడువు
ప్రజా దీవెన /న్యూఢిల్లీ: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలు రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS) గ్రేడ్ A క్రింద వస్తుంది.
అభ్యర్థుల కేటగిరీల ఆధారంగా వివిధ సీట్ల పంపిణీతో NABARD మొత్తం 150 ఖాళీలను అందించింది. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను NABARD అధికారిక వెబ్సైట్ nabard.org ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని సూచిస్తూ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 23వ తేదీగా, ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ అక్టోబర్ 16వ తేదీ గా నిర్ణయించారు.
SC, ST ల తో పాటు PWBD వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 150 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉండగా మరోవైపు జనరల్, ఓబీసీ కేటగిరీల పరిధిలోకి వచ్చే అభ్యర్థులు రూ. 800 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన అర్హత ప్రమాణాలను సమీక్షించాలని, అర్హత గల అభ్యర్థులు పోస్ట్ ల అవసరాలకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టులలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
అదనంగా అభ్యర్థుల వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
పరీక్ష మొత్తం వ్యవధి 120 నిమిషాలు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ప్రధాన పరీక్షలో రెండు దశలు ఉoడనుండగా ఇందులో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు లేదా 1 మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.