Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 10:03 am Posted by : praja deveena

Iran Israel US Conflict : బిగ్ బ్రేకింగ్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో సీఎం రేవంత్ అప్రమత్తం, తెలంగాణభవన్‌లో కంట్రోల్ రూo 

Iran Israel US Conflict : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పశ్చి మాసి యాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియ ర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇ ప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.

ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరు లు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో 24 గంట ల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, స హాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఇరాన్, గల్ఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎ లాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవ చ్చు.

న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవ న్ నుంచి పనిచేయ నున్న 24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:

— వందన బరువా, +91 98 71999044

— సీహెచ్. చక్రవర్తి, +91 99 58322143

— జావేద్ హుస్సేన్, 991001 4749

— రక్షిత్ నాయక్ : +91 9643723157

మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రి త్వ శాఖతో సమన్వయం చేసుకుం టూ అవసరమైన సహాయాన్ని అం దించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి

పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యా దేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎప్పటికప్పుడు అప్ర మత్తంగా, క్షేమంగా ఉం డాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రె డ్డి ఆకాంక్షించారు.యుద్ధ వాతావరణం, పలు దేశాల విమా నాశ్రయాలను మూసి వేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరా న్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కు కున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మా ర్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రా ధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదే శించారు.గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీ యుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ము ఖ్య మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్ర త కో సం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భార త్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర విదేశీ వ్య వ హారాల శాఖ మంత్రి జైశం కర్ ని వి జ్ఞప్తి చేశారు.