IRCTC : భారీగా పెరుగుతున్న ఈ స్టాక్స్ ధరలు… అవి ఏమిటో తెలుసా
--అయోధ్య రామ మందిరం ప్రారంభంతో పెరుగుదల --టూరిజం, హాస్పిటాలిటీకి సంబంధించిన 12 కంపెనీల స్టాక్స్ పెరిగే అవకాశం
భారీగా పెరుగుతున్న ఈ స్టాక్స్ ధరలు… అవి ఏమిటో తెలుసా
–అయోధ్య రామ మందిరం ప్రారంభంతో పెరుగుదల
–టూరిజం, హాస్పిటాలిటీకి సంబంధించిన 12 కంపెనీల స్టాక్స్ పెరిగే అవకాశం
ప్రజా దీవెన/ అయోధ్య: దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అయోధ్య రామ మందిరం ప్రారంభం సరికొత్త ఉత్సాహాన్ని నెలకొల్పింది. దాదాపు 500 ఏళ్ల వివాదం తర్వాత అయోధ్యలోని రామమందిరం నేడు మళ్లీ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఎంతో అద్భుతంగా నిర్మించిన రామ మంది రం అంగరంగ వైభవంగా తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 23వ తేదీ నుంచి ఇది సమస్త భక్తుల సందర్శనకు అవకాశం కల్పిస్తూ ట్రస్టు ప్రకటన జారీ చేసింది కూడా.
శ్రీరాముని దర్శనార్థం అయోధ్యకు లక్షలాది మంది భక్తులు ప్రస్తుతం అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య ట్రస్టు తో పాటు కేంద్ర ప్రభు త్వ నివేదికల ప్రకారం రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో రో జూ సుమారు 3లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా. ఇది అయోధ్యను ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తుoదనడంలో అతిశయోక్తి లేదు.
ఈ నేపథ్యంలో టూరిజం, హాస్పిటాలిటీకి సంబంధించిన 12 కంపెనీల స్టాక్ ధరలు భారీగా పెరి గే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నా యి. ఆ కంపెనీలు ఏంటి, వాటి షేర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*ప్రవేక్…* గుజరాత్‌కు చెందిన ఎగ్జిబిషన్లను నిర్వహించేప్రవేక్ సంస్థ పర్యాటకం, ఆతిథ్య రంగాలలో బలమైన ఉనికిని కలిగి ఉంది. అయోధ్యకు సమీపంలోని అనేక పర్యాటక ప్రదేశాల్లో విలాసవంతమైన గుడారాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది దాని షేరు ధర 50 శాతానికి పైగా పెరిగింది. ఇది నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.1,070.30గా ఉందoటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
*ఇండియన్ హోటల్స్…* టాటా యాజమాన్యంలోని ఇండియన్ హోటల్స్ సంస్థ బడ్జెట్ నుంచి స్టార్ వరకు వివిధ వర్గాల్లో హోటళ్లను నిర్వహిస్తుంది. అయోధ్యలో ఇప్పటికే రెండు ఆస్తులుoడగా నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దీని షేరు ధర రూ.483 గా కొనసాగితోంది.
*తాజ్ జివికె హోటల్స్* … హైదరాబాద్‌కు చెందిన జివికె గ్రూప్, ఇండియన్ హోటల్స్ జాయింట్ వెంచర్ తాజ్ జివికె హోటల్స్ . వివిధ ప్రాంతాల్లో హోటళ్లను కూడా నడుపుతోంది. నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దీని షేరు ధర రూ.247.55 గా ఉంది.
*ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్* ..ఇది భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోను కలిగి ఉన్న ఎయిర్‌లైన్ సేవల సంస్థ. గత నెలలో ఢిల్లీ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించింది. దీని షేర్ ధర ఈ ఏడాది 3 శాతం, గత ఏడాది 46 శాతం లాభపడింది. ఇది నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.3,043.10గా ఉంది.
*స్పైస్‌జెట్* …ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్ చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి అయోధ్యకు నేరుగా విమానాలను ప్రారంభిస్తోంది. నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దీని షేరు ధర రూ.64.73. గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్లకు 111 శాతం రాబడులను అందించింది.
*IRCTC* …ఆన్‌లైన్ టికెటింగ్, క్యాటరింగ్ సేవలను అందించే భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ప్రత్యేక రైళ్లు, టూర్ ప్యాకేజీలను కూడా నడుపుతుంది. రామ మందిరం ప్రారంభోత్సవం ప్రారంభమైన తరువాత మొదటి 100 రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 1,000 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది IRCTC షేర్ ధర 5 శాతం పెరిగింది. ఇది నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.1,026.40గా ఉంది.
*ఈజీ ట్రిప్* …ఈజీ ట్రిప్ అనేది రైళ్లు, హోటళ్లు, విమానాలు, మరిన్నింటికి బుకింగ్ సేవలను అందించే ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్. అయోధ్య యాత్రలకు భారీ డిమాండ్ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు కాబట్టి నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దీని షేరు ధర రూ.46.40కి పెరిగింది.
*థామస్ కుక్* …హాలిడే ప్యాకేజీలు, వీసా అసిస్టెన్స్, విదేశీ మారకం వంటి పర్యాటక, ప్రయాణ సంబంధిత సేవలను అందించే సంస్థ థామస్ కుక్. నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దీని షేరు ధర రూ.163.60కి చేరుకుంది.