Is Sai Pallavi going to be a nun: సాయి పల్లవి సన్యాసినిగా ఉండబోతోందా
--అక్కకన్నా ముందే చెల్లి పెళ్లి కుదరడంతో అనుమానం
సాయి పల్లవి సన్యాసినిగా ఉండబోతోందా
–అక్కకన్నా ముందే చెల్లి పెళ్లి కుదరడంతో అనుమానం
ప్రజా దీవెన/ హైదరాబాద్: సాయి పల్లవి (sai Pallavi) పెళ్లి చేసుకోకుండా ఉంటుందా, చివరి వరకు సన్యాసి జీవితం గడుపు తుందా? అంటే అవుననేలాగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందు కంటే సాయి పల్లవి చెల్లెలు అక్క కంటే ముందే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ( puja kannanan) రీసెంట్‌గా తన లవర్‌ని పరిచయం చేసింది.త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనుం ది.
సాధారణంగా భారతీయ కుటుం బాలలో ముందుగా అక్కకు పెళ్లి చేస్తారు. తర్వాతే చెల్లిని పెళ్లి పీటలకు ఎక్కిస్తారు. కానీ సాయి పల్లవి కుటుంబంలో ఇది రివర్స్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోదేమో అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూజా కన్నన్ తన లవర్ పేరు వినీత్ అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని స్వయంగా ప్రకటించింది.
పూజ కూడా నటిగా తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నిం చింది కానీ ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 2021లో ఆమె చిత్తిరాయి సెవ్వానం మూవీలో ఓ కీలక రోల్ పోషించింది. సముద్ర ఖని కూడా ఇందులో నటించాడు. ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది. దీని తర్వాత ఆమె మళ్లీ సినిమా చేయలేదు.
మరోవైపు సాయి పల్లవి నాగ చైతన్య సరసన “తండేల్” మూవీలో యాక్ట్ చేస్తోంది. కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ డ్రామా సాయి పల్లవికి మంచి హిట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
సాయి పల్లవి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్‌లో కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణ నిర్మిస్తున్న SK 21లో కూడా నటిస్తోంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ అప్‌కమింగ్ తమిళ మూవీ SK 21లో రాహుల్ బోస్, లల్లూతో పాటు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు మాత్రమే సాయి పల్లవి చేతిలో ఉన్నాయి. రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో నటించే ఛాన్స్ వస్తే సాయి పల్లవి కచ్చితంగా రష్మిక రేంజ్ లో సంపాదనతో పాటు క్రేజ్‌డమ్ చేయడం తెచ్చుకుంటుం ది. కానీ సాయి పల్లవి స్కిన్ షో చేయడానికి అసలు ఇష్టపడడం లేదు.
అలాగే పాత్రకు మంచి వెయిట్ ఉంటేనే చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. అందువల్ల ఆమె స్టార్ హీరోల సరసన నటించవచ్చు, లేదంటే అసలే నటించకపోవచ్చు.