Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ITMinisterDuddillaSridharBabu : బిగ్ బ్రేకింగ్, మంత్రి శ్రీధర్ బాబు కీలకప్రకటన, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఇంక్యూబేషన్ కేంద్రాలు

 

ITMinisterDuddillaSridharBabu: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణను “ఇన్నోవేషన్ హబ్” గా మా ర్చాలన్నదే తమ సంకల్పమని, వ రంగల్, నల్గొండ జిల్లాలోనూ టీ- హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేం ద్రాలను (incubation centers), ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశా రు. ఇందుకు సంబంధించి త్వరలో నే కాకతీయ, మహాత్మాగాంధీ వి శ్వ విద్యాలయాలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా వివ రించా రు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించ ను న్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫా ర్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడు కలను శనివారం ఆయన లాం ఛనం గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సైన్స్ కు మానవత్వాన్ని జోడి స్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితాని కి బాటలు వేస్తుందని అభిప్రాయప డ్డారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా మాత్రమే కా కుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గానూ మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంక ల్పమన్నారు. రీసెర్చ్ ను మార్కెట్‌ కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్ట మ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబ డు లను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నా రు. ఎలీ లిల్లీ లాంటి అంత ర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుం దన్నారు.డాక్టర్ల కంటే వేగంగా రోగా లను నిర్థారించినా, అనుభూతి చెం దే మనసును మాత్రం ఏ యంత్రం భర్తీ చేయలేద న్నారు. దేశంలో తమ అనుభవాన్ని ‘నాలెడ్జ్ ఇన్వెస్ట్ మెం ట్’గా పె ట్టేందుకు ముందుకు రావాలని ప్రవాసీ భారతీయ నిపుణులకు విజ్ఞ ప్తి చేశారు.

పేటెంట్లను కాకుండా మీ ఆవిష్క రణ వల్ల ఎంత మందికి మేలు జరి గిందన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుం దని యువ ఇన్నోవేటర్స్ కు దిశా ని ర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్ర తాప్ రెడ్డి, డా.బి .ప్రభా శంకర్, రాం ప్రసాద్ రెడ్డి, ప్రద్యుమ్న, డా.తామర విజయ్ కు మార్, ప్రొఫెసర్ భాస్కర్ ఆర్.జాస్తి, రాజేశ్వర్ తోట, ప్రొఫెసర్ జె. కృ ష్ణవేణి తదితరులు పాల్గొ న్నారు.