JagadeeshReddy : వంద రోజుల్లో పదేళ్ల ముందు దుర్భర పరిస్థితులు
--తెలంగాణలో కరువు కరాళ నృత్యం చేస్తోంది --రైతుల పక్షాన నిలిస్తే బండ బూతులు తిడుతున్నారు --కాంగ్రెసోళ్లకు పరిపాలన చేతకాద ని తేలిపోయింది --ప్రజలు రైతులు శాపనార్ధాలు పెడుతున్నారు -- మునుగోడు నియోజకవర్గ సమా వేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
వంద రోజుల్లో పదేళ్ల ముందు
దుర్భర పరిస్థితులు
–తెలంగాణలో కరువు కరాళ నృత్యం చేస్తోంది
–రైతుల పక్షాన నిలిస్తే బండ బూతులు తిడుతున్నారు
–కాంగ్రెసోళ్లకు పరిపాలన చేతకాద ని తేలిపోయింది
–ప్రజలు రైతులు శాపనార్ధాలు పెడుతున్నారు
— మునుగోడు నియోజకవర్గ సమా వేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: తెలంగాణలో నలుదిక్కులా కరువు కరాళ నృత్యం చేస్తుందని, వంద రోజుల కాంగ్రెస్ పాలనలో పదేళ్లకు ముం దు దుర్భర పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆందోళన వ్య క్తం చేశారు. ఎండిపోయిన పంటలకు నష్టప రిహారం ఇవ్వమని డి మాండ్ చేస్తే కాంగ్రెస్ ( congress government) నుంచి స్పం దన లేదని దుయ్యబట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంటు ఎన్నికల ప్రచా రం లో భా గంగా మును గో డు నియోజకవర్గం చౌటుప్పల్ లో నియో జ కవర్గ కార్యకర్తల సమావే శంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) కేసీఆర్ లాగు ఇడి పిస్తా, బజారుకిడిస్తా అంటుండగా, మరో మంత్రి బిఆర్ఎస్ ని వంద అడు గుల లోతులో బొంద పెడతా అంటున్నాడని, పరిపాలన చేత కాని వారు ఇలానే మాట్లాడుతారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు ప్రజల ను దోచుకునేందుకే అధికారం లోకి వచ్చారని, ప్రజలను దోచుకుం టున్న వారిని తాము బొంద పెడతామని హెచ్చ రిoచారు. అధికారం కో సం అడ్డదారులు తొక్కే పార్టీ కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్ప వని, కాంగ్రెస్ కు పొరపాటున ఓటేశామని ప్రజ లు భాద పడుతు న్నారని పేర్కొన్నారు. నమ్మి ఓటేస్తే అందరిని నట్టే ట్ట ముంచిన దొంగలు కాంగ్రెస్ నాయకులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతటి కరువు వచ్చినా ఉన్న నీళ్లను వాడుకోలేని దద్దమ్మలు కాంగ్రె స్ వాళ్లని విమర్శించారు. కేసీఆర్ రైతుల వద్దకు వచ్చి అడిగిన ప్రశ్న లకు ఒక్క సమాధానం లేదని అన్నారు. జిల్లాలో కోమటిరెడ్డి గడిచిన 20 రోజులుగా తప్పించుకు తిరుగుతు న్నాడని, జిల్లాలో మంత్రులు రైస్ మిల్లర్ల వద్ద అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
అన్న దాతల నోటి కాడ ముద్ద తిన్న ఘనులు జిల్లా మంత్రులని, ఢిల్లీ కి కప్పం కడుతూ పదవులు కాపాడు కుంటున్నారని మంత్రులు పై ఆగ్ర హం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం కుదేలయిందని, అన్న దాతలు అప్పులపాలయ్యారని విచారం వ్యక్తం చేశారు. కేసులు చేరి కలు, రాజకీయాలు తప్ప కాంగ్రెస్ కు ఒక్క మంచి మాట రావడం లే దని, కేసీఆర్ ని భయపెట్టే మొగోడు ఇంకా పుట్టలేదని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగారాష్ట్రానికి సంబంధించిన మ్యానిఫెస్టో కే దిక్కు లేదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ మ్యానిఫెస్టో అంటూ హంగామా చేస్తున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చెప్పిన హామీలకే దిక్కు లేదని, ఇప్పుడు కొత్తగా హామీలు అంటూ కాంగ్రెస్ మోసం చే స్తుందని, చేనేతల పొట్ట కొట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని, చేనేతల ఆత్మహత్య లకు కారణం అయ్యారని ఆరోపించారు.
ఈ సమావేశం లో భువనగిరి బి ఆర్ ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్ తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ యాదవ్, మాజీ ఎమ్మె ల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.