Lok Sabha Elections: పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి
పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్, వారు జిల్లాకు పట్టిన శని
రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు
కేసీఆర్ అనుభవం ముందు వీరంతా లిల్లి పుట్స్
గత 120 రోజుల పాలనలో ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేశారా?
నల్లగొండ జిల్లాను తాకట్టు పెట్టి.. కోట్లు సంపాదించింది కోమటిరెడ్డి బ్రదర్స్ కాదా..?
నా కుటుంభ చరిత్ర.. మీ కుటుంభ చరిత్ర ఏందో చర్చకు సిద్ధమా?
కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి గోబెల్స్ సిగ్గు పడతాడు
నేను ఉద్యమకారుని .. తల తెగినా తలవంచను
మీడియా సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన జగదీశ్ రెడ్డి
ప్రజా దీవెన నల్గొండ: పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకు వెళ్లే దమ్ము నాకు ఉందన్న జగదీష్ రెడ్డి, నేను ని కాస్ అయిన ఉద్యమకారుడిని, ఫైటర్ ను అని అన్నారు.
నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదన్నారు.కోమటిరెడ్డి (Komati reddy brothers) సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదన్నారు.కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుందన్న జగదీశ్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లా రాజకీయాల్లో వేదవలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, ఫ్లోరోసిస్ బాదితులు మూలగ లు అరిగిపోతున్నా,సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ఆర్ వద్ద ముడుపులు తీసుకున్న వెదవలు కోమటిరెడ్డి సోదరులు అని ధ్వజమెత్తారు. వైస్ ఇచ్చిన భిక్ష తో బ్రతికిన వాళ్ళు, కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. ఇప్పటికైనా వారు తమ నైజం ను మార్చుకోక పోతే జాగ్రత్త బిడ్డ, లాగు విప్పి కొడతాం అని హెచ్చరించారు.
నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.రేవంత్(Revanth reddy) బూట్లు తుడుస్తూ కోమటిరెడ్డి అన్నదమ్ములు పబ్బం గడుపుతున్నారని తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఫైనాన్స్ సంస్థ లను మోసం చేస్తూ కోట్లాది రూపాయలను దోచుకున్న వీరు ఆగర్భ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు.నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఎంటో చర్చ పెడదామా అంటూ సవాల్ విసిరారు.
తమ కుటుంభ చరిత్ర ఆస్తులపై మీడియా మిత్రులు విచారించాలని జగదీష్ రెడ్డి కొరారు. కోమటిరెడ్డి సోదరుల బలుపు అనగగోడతామన్న ఆయన వాళ్లు జిల్లాకు పట్టిన శని అంటూ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం నాకు అలవాటు లేదని, అలా చెయడం మొదలు పెడితే కోమటి రెడ్డి బదర్స్ ప్రజలలో తిరగలేరని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ అనుభవం, కమిట్మెంట్ ముందు వీరంతా లిల్లి పుట్స్ అన్నారు.గత 120 రోజుల పాలనలో ప్రజలకు పనికొచ్చే పనులు ఏమైనా చేశారా..? అంటూ ప్రశ్నించారు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే… బీజేపీ లోకి పోతాడు అని కాంగ్రెస్ మంత్రులే లీక్ లు ఇస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ లో ఐదేళ్ల పాటు సిఎంలను కొనసాగించే అలవాటు లేదన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో ఒకరోజు జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి గోబెల్స్ సిగ్గు పడతాడన్న జగదీష్ రెడ్డి,
గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన ఘనులు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ జోలోకి వస్తే తన్ని తరిమిస్తాం అని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి.. ఫైటర్ ను..ప్రజల కోసం ఎన్ని సార్లు అయిన జైల్ కి పోయే దమ్మున్న నాయకున్ని నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు అని అన్నారు.
Jagdish Reddy sensational comments on Revanth