Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagruthi mlc BRS Kavitha:మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతం

--ఆడబిడ్డల హక్కలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది --రేవంత్ సర్కార్ కొత్త జీవో 3ను వెంటనే నిలిపివేయాలి -- కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీకి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతం

–ఆడబిడ్డల హక్కలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది
–రేవంత్ సర్కార్ కొత్త జీవో 3ను వెంటనే నిలిపివేయాలి
— కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీకి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

ప్రజా దీవెన/ హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి నటువంటి గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థు లు నమ్మి మీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రభుత్వంలోకి తీసుకురా వడంలో కీలక పాత్ర పోషించారని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. ఆ నాడు తెలంగాణ విద్యార్థినుల యొక్క చావులతో సహా అనేక అంశాలను అనవసరం గా రాజకీయం చేసి విద్యార్థుల్లో భయాందోళనను కల్పించి ఓట్లు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక శైలిని అవలంభించిందని, అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కలను తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కవిత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశా ల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబరు 41, 56 జారీ అయ్యాయనా, దీనికి 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చిందని వివరించారు. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారని, మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోందని తెలిపారు.

మహిళలకు అవకాశా లు లేక, విద్యా ప్రమాణాలు అందుకోలేక కొన్ని సంవత్సరాల పాటు కోల్పోయినప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తోందని, ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో మీ గ్యారెంటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకురావడం జరిగిందని చెప్పారు.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా మేము మహిళల హక్కులను హరించబో మని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిందని, కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుం డా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుందన్నారు. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేష న్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తూ చేస్తూ మహిళల ఉద్యోగావకాశా లకు శరాఘాతంగా నిలవనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉదాహరణకు ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నారని, అందులో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారని చెపుతూ ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందoటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి, అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాల్సి ఉందని పేర్కొన్నారు. అదే ఈ రిజర్వేషన్ల ఈ స్ఫూర్తిని పక్కనబెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు.

ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తిగా తెలంగాణలో మీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నానని, ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పును పాటించబోమంటూ బిహార్, కర్నాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి,

కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతోని ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు.ఈ విషయంలో తమరు జోక్యం చేసుకొని ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.