Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 3:09 pm Posted by : praja deveena

Jala Sadhana samithi Dusharla Satyanarayana injured : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లా ప్ర కృతి ఒడిలో విషాదం,జలసాధన సమితి ‘దుశర్ల’ పై గొర్ల కాపర్ల దాడి

Jala Sadhana samithi Dusharla Satyanarayana injured : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లా మోతే మండలం, రాఘవాపురం పర్యావరణ ప్రేమికులకు, జల ఉద్యమకారులకు ఇది నిజం గా దిగ్భ్రాంతికరమైన వార్త ఎడారి లా మారుతున్న భూమిని తన శ్రమతో పచ్చని అడవిగా మార్చిన జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ ర్ల సత్యనారాయణపై స్థానిక గొర్లకాపర్లు దాడికి పాల్పడ్డారు.

రాఘవాపురం గ్రామంలో ఏకంగా 70 ఎకరాల బంజరు భూ మిని తన సొంత ఖర్చుతో, అకుంఠిత దీక్షతో దట్టమైన అడ విగా మార్చిన సత్య నారాయణ, దశాబ్దాలుగా పశుప క్షా దులకు, మూగజీవాలకు ఆ కొం డంత అండగా నిలిచిన వి షయం తెలిసిందే.ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆయ నపై, అదే ప్రాంతా ని కి చెందిన గొర్ల కాపర్లు ఒక్కసారిగా దా డికి దిగారు. ఈ అకస్మాత్తు దా డిలో సత్యనారాయణ తీవ్రం గా గాయపడ్డారు.

దాడి జరిగిన వెంటనే ఆయనను స్థానికులు హుటాహుటిన సమీపం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆ యనకు వైద్యులు చికిత్స అందిస్తు న్నా రు. ప్రకృతిని నమ్ముకుని, వంద ల ఎకరాల అటవీ సంపద ను కాపాడుతున్న వ్యక్తిపై జరిగిన ఈ దాడి పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి గల అస లు కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.