Task Training:టాస్క్ శిక్షణతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
టాస్క్ శిక్షణ లతో బీటెక్ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి ,అవకాశాలుకలుగుతాయని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్అడ్వైజర్పోతుగంటి ,నాగేశ్వరరావు,డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు లు అన్నారు.
టాస్క్ శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి… నాగేశ్వరరావు
ప్రజా దీవెన, కోదాడ: టాస్క్ శిక్షణ లతో బీటెక్ విద్యార్థులకు(BTech students) ఉద్యోగ ఉపాధి ,అవకాశాలుకలుగుతాయని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్అడ్వైజర్పోతుగంటి ,నాగేశ్వరరావు,డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు లు అన్నారు. శుక్రవారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో(Kitts College of Engineering for Women) టాస్క్ శిక్షణా తరగతులను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో నైపుణ్యత కోసం కళాశాల యాజమాన్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గాంధీ మాట్లాడుతూ బిటెక్ విద్యార్థులకు పైథాన్(Python),డిజాంగ్ పై ప్రత్యేక శిక్షణ ఉన్నత లక్ష్యాల సాధనకు ఎంతో దోహదపడుతుందన్నారు. కళాశాల యాజమాన్యం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టాస్క్ ట్రైనర్ రాకేష్(Rakesh) విద్యార్థులకు ప్రోగ్రాం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ కృష్ణారావు(AO Krishna Rao) హెచ్వోడీలు అధ్యపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Job Employment Opportunities Task Training