Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 3:09 pm Posted by : praja deveena

Journalist Accreditations : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్య, పాత జీఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ 

Journalist Accreditation : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు పాత జీఓ ప్రకారమే అక్రెడిటే ష న్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌరసంబంధాల శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. గురువా రం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు కలి శారు. ఈ సందర్భంగా జీ.ఓ 252, జీ.ఓ 103లో కేబుల్ ఛాన ల్స్ కు అక్రెడిటేషన్స్ జా రీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందిం చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత జీ.ఓ ప్రకారమే జ ర్నలిస్టుకు అక్రెడిటేషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు.

ఎవరూ ఆందోళన చెందివద్దని మం త్రి భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్య ద ర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ. ర మణ కుమార్, సిటీ కేబుల్ ఎం.డి శివరామ కృష్ణ, ఎం.ఎస్ ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివా స్ రెడ్డి, కేబుల్ చానె ల్స్ జేఏసీ నాయకులు కడకంచి వెంకటేష్, హెచ్ వి.చలపతి, దేవేందర్, అరవింద్, బ్రహ్మం, రాజేష్ తదితరులు ఉన్నారు.