Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 3:14 pm Posted by : praja deveena

Jupally Krishna Rao sensational comments : మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకప్రకటన, ఫణిగిరి బౌద్ధక్షేత్రంకు రూ.5కోట్ల నిధులు మంజూరు

 

Jupally Krishna Rao sensational comments :   ప్ర జా దీవెన, తుంగతుర్తి: అది దా దాపు 2500 ఏళ్ల నాటి కా లం… బౌద్ధ భిక్షువులు శాంతి మంత్రాన్ని జపించిన పవిత్ర భూమి. ఆచార్య నాగార్జునుడి పాదస్పర్శతో పులకించిన నే ల. కాలగర్భంలో కలిసి పోయిన ఆ అద్భుత చారిత్రక వై భ వానికి ఇప్పుడు మళ్లీ పూర్వ వై భవం రాబోతోంది. సూర్యా పేట జిల్లా నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ క్షే త్రం, అలాగే గాజు లబండ బౌద్ధ క్షేత్రాల పునరుద్ధరణకు సరి కొత్త అడుగులు పడ్డాయి.

సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఫణిగిరి గు ట్టపై ఉన్న బౌద్ధా రామాలను, మ్యూజియాన్ని సందర్శిం చా రు. ఈ సందర్భంగా క్షేత్రాల పునరుద్ధరణ పనులకు శంకు స్థాపన చేయడంతో పాటు ఫణిగిరి అభివృద్ధి కోసం రూ. 5 కోట్ల భారీ నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటిం చారు. మ్యూజి యంలో భద్రపరిచిన శతాబ్దాల నాటి చరిత్ర ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తిగా తిలకించారు.

తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన నాణేలు, కరెన్సీతో పాటు అపు రూపమైన బుద్ధుని విగ్రహాలు, బుద్ధపాదాలు, చారిత్రక అవశేషాలు ఇక సమ్రాట్ అశోకుని కాలం నాటి విశిష్ట శాస నాలు తదితర ఈ చారి త్రక సంపదను చూసి అబ్బురప డి న మంత్రి, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అ ద్భుతమైన వారసత్వ సంపద, కట్టడాలు ఉన్నాయని కొని యాడారు.

నాడు ఇక్ష్వాకులు, కాకతీయులు, నిజాం నవాబులు ఈ నేలపై ఎన్నో వైవిధ్యమైన నిర్మాణాలు చేశారు. అందులో భాగంగానే వెలసిన ఫణి గిరి ఎంతో ప్రసిద్ధమైనది. గత ప్ర భుత్వాల నిర్లక్ష్యానికి గురైన టూరిజం శాఖను ఇకపై దేశం లోనే నెం బర్ వన్ స్థానంలో నిలబెడతామని మంత్రి జూప ల్లి కృష్ణారావు వెల్లడించారు.

    పీపీపీ మోడల్‌లో అభివృద్ధి..

యువతకు ఉపాధి రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధి కోసం స రికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి వెల్లడించా రు. ప్రభుత్వ, ప్రై వేట్ భాగస్వామ్యం (PPP Mode) ద్వారా పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేసి, స్థానిక యువతకు వం దలాది సంఖ్యలో ఉపాధి అవ కాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జి ల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెం కన్న యాదవ్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడి పాటి నరసయ్యతో పాటు పలువురు వివిధ శాఖల అధికా రు లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.