Kalewswaram CM RevanthReddy : త్వరలో విధ్వంస జలదృశ్యo
--ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్ --టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఉద్దేశించి --రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపిన తాజా ట్విట్ --ఆహ్వానించినా బిఆర్ఎస్, బిజెపి రాలేదన్న మంత్రులు
త్వరలో విధ్వంస జలదృశ్యo
–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్
–టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఉద్దేశించి
–రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపిన తాజా ట్విట్
–ఆహ్వానించినా బిఆర్ఎస్, బిజెపి రాలేదన్న మంత్రులు
ప్రజా దీవెన/ హైదరాబాద్: విధ్వంస మైన జలదృశ్యాన్ని కల్లారా చూడబోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) ఆసక్తికర ట్వీట్ వైరల్ అయ్యింది. బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డకు చేరుకున్న క్రమంలో బీఆర్‌ఎస్ అధి నేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అ య్యింది. కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwa ram project) బలైందని, మర మ్మతులకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై చిందు లుతొక్కిన బీజేపీ, వాస్తవా లు చూడడానికి రావడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు.
*సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ సారాంశం ఇలా ఉంది…* తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి కనీసం 97 వేల ఎకరాల కు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిం దేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యం లో వాస్తవాలు తెలంగాణ (Telangana )సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్‌తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి.
మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన ( Nine and a half years of KCR’s rule were disastrous) జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లి ఇప్పటికే ప్రాజెక్టు పరిశీలనలో ఉంది రేవంత్ రెడ్డి బృందం.
*పిల్లర్లను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం…* కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైన 20, 21 పిల్లర్లపై భాగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. తర్వాత బ్యారేజి కింది భాగం గోదావరి నదిలోకి వెళ్లి బ్యారేజీలో నిర్మించిన 20, 21 పగుళ్లు బారిన పడిన పిల్లర్లను ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
కుడివైపుకు చేరుకొని బ్యారేజీలో కుంగిపోయిన కింది భాగాన్ని కృంగిపోయిన పిల్లలను చూశారు. వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఆయన వెంట రాష్ట్ర ఐటీ పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో (With Minister Duddilla Sridhar Babu) పాటు పలువురు మంత్రులు శాసనసభ్యులు ఉన్నారు.
ఇది ఇలా ఉండగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ గ త ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మండిపడ్డారు. తప్పు జరిగింది కాబట్టే బిఆర్ఎస్ నేత లను మేము అహ్వానించినప్పటికి ముఖం చాటేసారని ఎద్దేవా చేశా రు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే రాలేదని వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tumm ala Nageswara Rao) మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో ఎన్నో లోపాలు ఉన్నాయని అన్నారు. డిజైన్ లోపాల గురించి ఆనాడే తాను కేసీఆర్ కు చెప్పానని గుర్తు చేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ప్రధానమైనదని, మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలుస్తేనే ఎక్కడికైనా ఎత్తిపోయోచ్చని అన్నారు.
కానీ పరిస్థితి అలా లేదని మిగతా జలాశయాలకు ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. కాగా మేడిగడ్డ సందర్శనకు రావాలని పార్టీలకతీతంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలను అందరినీ ఆహ్వానించారు కానీ టిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు గైరాసరయ్యారన్నారు.