Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:31 am Posted by : praja deveena

Kancharla Bhoopal Reddy Arrest : బిగ్ బ్రేకింగ్, మర్రిగూడ బైపాస్ వ ద్ద ‘మహా’ ఉద్రిక్తత, కంచర్ల భూ పాల్ రెడ్డి అరెస్ట్.. రోడ్లపై స్తంభిం చిన ట్రాఫిక్

Kancharla Bhoopal Reddy Arrest : ప్రజా దీవెన, నల్ల గొండ: మర్రిగూ డ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉత్కంఠ భరిత సన్ని వేశం చోటుచేసుకుంది. నిర్మాణం పూర్తయి రెండు నెలలు గ డుస్తున్నా.. రాజకీయ కారణాలతో ఫ్లైఓవర్‌ను ప్రారంభించ కపోవడం, ఈ లోగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుండ టంపై మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వ ర్యంలో శనివారం ‘మెరుపు ధర్నా’ నిర్వహించారు. స్థానిక ప్ర జల ప్రాణాలతో ఆడుకుంటున్న పాలకుల వైఖరికి నిరసన గా చర్లపల్లి వ ద్ద జరిగిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

నిధుల సాధన నుండి నిర్లక్ష్యం దాకా

గతంలో కాంగ్రెస్ నాయకుల నిర్ల క్ష్యం వల్ల మర్రిగూడ, పాన గల్ బై పాస్‌ల వద్ద పదుల సంఖ్యలో మరణాలు సంభవిం చాయి. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి ఈ విషయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ తక్షణమే స్పందించి రెండు బై పాస్ ఫ్లైఓవర్లకు భారీ నిధులు మంజూరు చేశారు.

పానగల్ బైపాస్ ఎప్పుడో పూర్త యి ప్రజలకు అందుబాటు లోకి వచ్చింది.కానీ, మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ రెండు నెలల క్రితమే సిద్ధ మైనప్పటికీ.. క్రెడిట్ రాజకీయాల వల్ల దీనిని ప్రా రంభించకుండా నానబెడుతున్నారు. ఈ నిర్లక్ష్యం కా రణం గా ఇటీవల ఓ ప్రయాణికు డు ప్రాణాలు కోల్పోగా, పలువు రు తీవ్రంగా గాయపడ్డారు.ప్రజల ప్రాణాల కంటే రాజకీయా లే ఎక్కువయ్యాయా? కలెక్టర్ స్వ యంగా వచ్చి సమస్యను పరిష్క రించే వరకు, ఫ్లైఓవర్ తెరిచే వర కు మేము ఇక్కడి నుండి కదిలేది లేదoటూ ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి భీష్పించుకుని కూర్చున్నారు

    రణరంగంగా మారిన చర్లపల్లి

స్థానిక ప్రజలు ఈ గోడును కంచర్ల భూపాల్ రెడ్డి దృష్టికి తీ సుకెళ్లడంతో ఆయన పిలుపు మేరకు వందలాది మంది రో డ్డుపైకి వచ్చారు. కంచర్లకు మద్దతుగా స్థా నిక ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్య కర్తలు రణరంగంలో సైనికుల్లా మొహరిం చా రు. దీంతో హైవేపై కి లోమీటర్ల మేర వందలాది వాహ నాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తి గా స్తంభించింది. దీంతో పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో డీఎస్పీ నేతృత్వంలో భారీగా పో లీస్ బలగాలు రంగంలోకి దిగా యి. భీష్మించుకు కూర్చు న్న కం చర్ల భూపాల్ రెడ్డితో పాటు ఉన్న

మాజీ మున్సిపల్ చైర్మన్ మంద డి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షు లు భువనగిరి దేవేందర్, పలువు రు కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

తీవ్ర తోపులాట, ఉద్రిక్తతల నడు మ కంచర్ల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ యనను పోలీస్ వాహనంలో కనగల్ వైపు తరలించారు.అరెస్టులతో ఉద్య మాన్ని ఆపలేరని, ఫ్లైఓవర్ ప్రారం భించే వరకు తమ పోరాటం ఆగే ది లేదని బీఆర్‌ఎస్ శ్రేణులు మ రియు స్థానిక ప్రజలు హెచ్చరిస్తు న్నారు. మర్రి గూడ బైపాస్ రచ్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.