Kancharla Nomination in plain sight: సాదాసీదాగా కంచర్ల నామినేషన్
--హంగూ ఆర్భాటాలు లేకుండా దాఖలు --దేవాలయాల్లో పత్రాలకు పూజల అనంతరం ఆర్వోకు అందజేత --మీడియాతో కోమటిరెడ్డి పై విరుచుకుపడ్డ భూపాల్ రెడ్డి
సాదాసీదాగా కంచర్ల నామినేషన్
–హంగూ ఆర్భాటాలు లేకుండా దాఖలు
–దేవాలయాల్లో పత్రాలకు పూజల అనంతరం ఆర్వోకు అందజేత
–మీడియాతో కోమటిరెడ్డి పై విరుచుకుపడ్డ భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: నల్లగొండ ఎమ్మెల్యే, బిఅర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి సాదాసీదాగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఇదిలా ఉండగా నామినేషన్ వేసే ముందు ఆయన విటి కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆర్వో కు పత్రాలు అందజేశారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు గెలిచి, మంత్రిగా కూడా పనిచేసినా నలగొండ లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు.
కెసిఆర్ దత్తత తీసుకుని నేను ఎమ్మెల్యే గా ఉన్నకాలంలోనే నలగొండ నవ నిర్మాణం జరుగిందని, ఇంకా కొనసాగుతోందని వివారించారు. ఈ ఐదేళ్లు ఎక్కడ పన్నావని, కరోనా సమయంలో సాయం సంగతి దేవుడెరుగు కనీసం కనిపించా వా అని ఆయన ప్రశ్నించారు.
నల్లగొండ ప్రజలు గెలిపిస్తే హైదరాబాద్ లో పడుకున్నావు, తరిమికొడితే భువనగిరికి పారిపోయినావు, ఇతర పార్టీల నాయకులను పశువులను కొన్నట్లు కొనేందుకు మళ్ళీ నల్లగొండకు వచ్చావు అంటూ దుయ్యబట్టారు.
నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నప్పుడు ఎక్కడ పడుకున్నావంటూ గుర్తు చేశారు. నల్లగొండ ప్రజలకు అన్నీ గుర్తున్నాయని, సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిలకడలేని మీ అన్నదమ్ములు ఎప్పుడు ఏ పార్టీలోకి పోతరో, ఎప్పుడు ఏమి మాట్లాడుతారో మీకే తెలియదని ఎద్దేవా చేశారు.
మూడోసారి KCR అధికారంలోకి వస్తే మహిళల అభివృద్ధి కోసం రూ. 400కే గ్యాస్ ఇవ్వడమే కాకుండా అర్హులకు ప్రతి మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పేరుతో రూ. 3016 ఇస్తామని, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పధకాలను మరింతగా అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చే రైతు బంధును రూ. 10 వేల నుంచి రూ. 16 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి, నిరంజన్ వలి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంజి యూనివర్సిటీ సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, చిట్యాల సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి, జేఏసీ అధ్యక్షులు జే వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నేతి రఘుపతి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జెడ్పి కోఆప్షన్ సభ్యులు తీగల జాన్ శాస్త్రి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారా యణ, జమాల్ ఖాద్రి, రంజిత్ , నాయకులు బక్క పిచ్చయ్య మాలే శరణ్య రెడ్డి, సింగం రామ్మోహన్, లక్ష్మి, ఫరీద్ దొద్దిన్ మైనం శ్రీనివాస్,పెరిక ఉమామహేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ లు వంగాల సహదేవరెడ్డి ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్రెడ్డి దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, తిప్పర్తి కనగల్ మాడులపల్లి నల్లగొండ వైస్ ఎంపీపీలు ఏనుగు వెంకట్ రెడ్డి, రామగిరి శ్రీధర్ రావు, సూది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరమేష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ లు, కందుల రేణుక లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.