IndiaOpinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

karnataka bus fire accident : బిగ్ బ్రేకింగ్, కర్ణాటకరాష్ట్రంలో ఘోర బస్సుప్రమాదం, 17 మంది సజీవదహనo

 

karnataka bus fire accident : ప్రజా దీవెన బెంగుళూరు: దేశం మ రోసారి ఉల్లిక్కి పడింది. దేశం లోని నలుమూలల ఎక్కడ చూసినా ఘో ర ప్రమాదాలతో ఊహిం చని విధం గా మృత్యు ఘం టికలు మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోమరో ఘోర బస్సు ప్రమాదం సంభవిం చింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్‌ బ స్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో దాదాపు 17మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తు న్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ఈ ప్రమాదం చోటుచే సు కుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘట నా స్థలానికి చేరుకున్న మంటలు ఆ ర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్ర దుర్గ జిల్లా హిరియూర్​ తాలుకా లోని హోర్లథు క్రాసింగ్​ సమీ పంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 3 గం టలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

హియూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఓ లారీ అదుపు త ప్పి డీవైడర్​ని దాటింది. ఆ వెంటనే, అ టుగా వస్తున్న ప్రైవేట్​ బ స్సును బలంగా ఢీకొట్టింది. నేరుగా డీజిల్​ ట్యాంక్​ని లారీ ఢీకొట్ట డం తో బస్సు లో మంటలు చెలరేగి క్షణాలవ్య వ ధిలో మొత్తం బ స్సు కు మంటలు వ్యాపించాయి. ప్రమాదం సమయంలో ఈ ప్రైవేట్​ బ స్సు బెంగళూరు నుంచి శివమొగ్గవైపు వెళుతోంది.

ప్రమాదం సమయంలో బస్సులో 30కిపైగా మంది ప్రయాణికులు ఉ న్నట్టు తెలుస్తోంది. ప్రమాదం సమ యంలో చాలా మంది నిద్రపో తూ ఉండటంతో బస్సుకు మంటలు అం టుకున్నట్టు గమనంలో లేకపోవడం తో ఫలితంగా అనేక మంది సజీవద హనమయ్యారు. మంటలు చెలరేగుతున్నట్టు అర్థం చేసుకున్న కొందరు మాత్రమే బస్సు నుంచి బయటపడేందుకు ప్రయ త్నించారు. వీరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కర్ణాటక బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అప్ర మత్తమైన పోలీసులు ఘ టనాస్థలానికి చేరుకున్నారు. స్థాని కులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 13 మృత దేహా లను వెలికితీయగా 9మంది క్షతగాత్రులను సిరా ఆసుపత్రికి తర లించారు. హిరియూరులోని ఆసు పత్రిలో ఇంకొందరికి చికిత్స జరు గుతోంది.

లారీ డ్రైవర్​ నిర్లక్షం వల్ల ఈ ప్రమా దం జరిగినట్టు ప్రాథమిక దర్యా ప్తు బట్టి తెలుస్తోంది. బలంగా ఢీకొట్ట డంతో బస్సులో మంటలు చె లరేగా యి. సహాయక చర్యలు మరింత కష్టంగా మారాయి. ఈ ఘ టనపై కేసు నమోదు చేశామని, బస్సు ప్ర మాదంపై దర్యాప్తు చేప ట్టామని, ఆడిట్​ నిర్వహించిన తర్వాతే మర ణాల సంఖ్యపై కూడా స్పష్టత వ స్తుందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.ఈ ప్రమా దంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్​ కు అంతరాయం జరిగిం ది. ప్రస్తుతం శిథిలా ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరిన్ని పూర్తి వివరాలు అందా ల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related Articles

Back to top button