IndiaOpinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Karnataka Terrible Road Accident : బిగ్ బ్రేకింగ్, కర్నాటకలో ఘోర ప్ర మాదం, ఒకే కుటుంబంలో ఐదుగు రు దుర్మరణం

Karnataka Terrible Road Accident : ప్రజా దీవెన, కల బురగి:అది తెల్ల వారుజాము సమయం రోడ్డుపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. మరికొద్ది సేపట్లో వారు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ విధి ఆ కుటుంబం పై పగబట్టింది. ఒకే ఒక్క క్షణం ఊహించని ప్రమాదం రూపం లో మృత్యువు దూసుకొచ్చింది. కర్నాటక సరిహద్దుల్లో జరి గిన ఒక ఘోర రోడ్డు ప్ర మాదం ఒకే కుటుంబానికి చెందిన ఐ దుగురిని బలితీసుకుంది.

అర్ధరాత్రి వేళ లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు కర్నాటకలోని లాడ్లాపూర్‌ సమీ పంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న ఒక క్రూజర్‌ వాహ నం, అంతే వేగం తో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొ ట్టింది. ప్రమాదం జరిగి న తీవ్రతకు క్రూజర్‌ వాహనం పూర్తి గా నుజ్జునుజ్జయ్యింది.వాహనంలో ఉన్నవారంతా లోపలే చిక్కుకుపోయారు.

    ఒకే కుటుంబంలో తీరని విషాదం

ఈ భీకర ప్రమాదంలో ఒకే కుటుం బానికి చెందిన ఐదుగురు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ క్షణంలో అక్కడ మిగిలింది కేవలం ఆక్రందనలు మాత్రమే కావడం గమనా ర్హం.మృతులుగా క్యాష్వార్‌, హుస్సేన్‌ షా,మహబూబ్‌ అలీ, ర సూల్‌ బీ,ఫాతిమా అలీలుగా గు ర్తించారు. ప్రమాద సమా చారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చే రుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకు ని, కేసు నమోదు చేసి దర్యాప్తు జ రుపుతున్నారు. మితిమీరిన వేగ మే ఈ ప్రమా దానికి కారణమని ప్రా థమికంగా భావిస్తున్నారు. ఒకే కు టుంబానికి చెందిన ఐదుగురు క న్నుమూయడంతో వారి స్వగ్రామం లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్ర యాణాల్లో కాస్త అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి ప్రమాదం జరు గుతుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు.

Related Articles

Back to top button