Karunakar Reddy’s appointment as TTD chairman is disgraceful టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం అవమానకరం
-- బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం అవమానకరం
— బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
ప్రజా దీవెన/ తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం భక్తులకు అవమానకరమని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వ్యాఖ్యానించారు. కరుణాకర్ రెడ్డి హిందువు కాదని, ఒక అన్యమతస్తుడిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇతనినే నియమించి తప్పుడు విధానాన్ని అవలంబించాడని గుర్తు చేశారు. అప్పట్లోనే టీటీడీలో అన్యమతస్తుల్ని ఉద్యోగులుగా తీసుకోవడం జరిగిందని ఆనాటి ప్రభావమే నేడు తిరుమల కొండల్లో అన్యమత ప్రచారం యదేచ్చగా జరుగుతుందని వివరించారు. ఇప్పుడు కూడా వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎలా చైర్మన్ గా నియమిస్తారని అతను మరలా టీటీడీ ఏడు కొండల్ని రెండు కొండలుగా మార్చే విధానం చేపడుతాడని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆందోళన వ్యక్తంచేశారు.
గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పింక్ డైమండ్ మాయమైందని నాడు తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఇప్పటి ప్రతిపక్ష నేతపై అబద్ధాలు ప్రచారం చేశారని మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తారని శ్రీధర్ ప్రశ్నించారు.
పింక్ డైమండ్ గురించి జగన్ ప్రభుత్వం నేటివరకు ఎందుకు నోరు మెదప లేదని శ్రీధర్ ప్రశ్నించారు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అన్యమతస్తుల్ని కాకుండా హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులని చైర్మన్ గా నియమించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.