Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR is an eternal warrior: కెసిఆర్ నిత్యపోరాట యోధుడు

-- చీటర్లతో అస్సలు చీర్స్ కొట్టరు -- మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు -- మోదీ చేసిన వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్

కెసిఆర్ నిత్యపోరాట యోధుడు

— చీటర్లతో అస్సలు చీర్స్ కొట్టరు
— మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
— మోదీ చేసిన వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ నిరంతర ఫైటర్ అని ఛీటర్ లతో అస్సలు కలసి పనిచేయరని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటు కౌంటర్ ( He has a strong counter to Modi’s comments) ఇచ్చారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ అవార్డు వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని కేటీఆర్ కొట్టిపారేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు పోరాట యోధుడు కేసీఆర్‌నే మళ్లీ కోరుకుంటారని (No matter how much Modi shouts, the people of Telangana will want the warrior KCR again) చెప్పారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలారా అని ఆయన ప్రశ్నించారు.

మోదీ రాజు, యువరాజు అంటూ ఏదో దిగజారి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అకాలీదళ్, పీడీపీ, టీడీపీల విషయంలో అనాడు రాచరికం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తాము ఎవరికీ గులాంలు కాదని గుర్తు చేశారు. రాచరికం అప్పుడు మోదీ ఎన్‌ఓసీ తమకు ఎంత మాత్రం అవసరం (Monarchy then Modi NOC how much they need)  లేదన్నారు.

తెలంగాణలో బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్ రాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను సీఎం కావడానికి మోదీ పర్మిషన్ అవసరం లేదని ( He said he did not need Modi’s permission to become CM) , కీలక పార్టీలే ఎన్డీఏను వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము కర్ణాటకకు డబ్బులు పంపుతుంటే మీ ఐటీ టీం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆయనతో ఉంటే మంచి లేదంటే చెడుగా చిత్రీకరిస్తారన్నారు.

దేవగౌడ కుమారుడితో కలిసినప్పుడు రాచరికం గుర్తుకు రాలేదా ( When he met the son of Deva Gowda, he did not remember the monarchy) అని ప్రశ్నించారు. జైషా ఎవరు ఆయనకు క్రికెట్ పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మీరు భయపెడితే తాము భయపడబోమన్న కేటీఆర్ ఈ మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోరన్నారు.