KCR is the welfare of the people: కెసీఆర్ తోనే సబ్బండ వర్గాలకు సంక్షేమం
--ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి కంచర్ల, బి అర్ ఎస్ కార్యదర్శి చాడ
కెసీఆర్ తోనే సబ్బండ వర్గాలకు సంక్షేమం
–ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి కంచర్ల, బి అర్ ఎస్ కార్యదర్శి చాడ
ప్రజా దీవెన/ నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోనే సబ్బండ వర్గాలకు సంక్షేమం ఫలాలు అందుతాయని నల్లగొండ టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండ పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించారు.
అన్ని వర్గాలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారంటే కేవలం కెసీఆర్ ఆలోచనలే ఎప్పుడు ప్రజల కోసం ఉంటాయని తెలిపారు. అభివృద్ది, సంక్షేమం లో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కెసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.
బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కే ఓటు వేసి మరోసారి గెలిపించాలని, రాష్ట్రoలో కేసిఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించాలని, నలగొండ అభివృద్ధికి దోహదపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రచార కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ యామా కవితా దయాకర్, కౌన్సిలర్ లు వట్టిపల్లి శ్రీనివాస్, గుర్రం ధనలక్ష్మి, వెంకన్న పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, వార్డు ఇంచార్జ్ కొండూరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ దండెంపల్లి సత్తయ్య వార్డు ఇంచార్జ్ కంకణాల వెంకట్ రెడ్డి, టౌన్ పార్టీ కార్యదర్శి,కాసం శేఖర్, చైతన్య ఆయా వార్డుల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు