KCR schemes are Sri Ramaraksha: కెసీఆర్ పథకాలే శ్రీరామరక్ష
--తిప్పర్తి మండంలంలో విస్తృతంగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం -- పాల్గొన్న అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి, నేతలు చాడా కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్
కెసీఆర్ పథకాలే శ్రీరామరక్ష
–తిప్పర్తి మండంలంలో విస్తృతంగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం
— పాల్గొన్న అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి, నేతలు చాడా కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్
ప్రజా దీవెన/నల్లగొండ: ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి శ్రీరామరక్ష అని నల్లగొండ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం లోని ఎల్లమ్మ గూడెం ఆరెగూడెం, గోదావరి గూడెం మామిడాల, యాపలగూడెం, ఇండ్లూరు వెంకటాద్రిపాలెం సోమోరుగూడం, ఎర్రగడ్డలగూడెం పజ్జుర్ గ్రామాలలో విస్తృతoగా పర్యటించి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ లతో కలిసి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మామిడాల గోదావరి గూడెం వాగుపై వంతెన నిర్మాణం పూర్తి చేశామని, గోదావరి గూడెం వద్ద 4.50 కోట్లతో చెక్ డాం నిర్మాణం, ప్రతి గ్రామంలో కోటికి పైగా నిధులు ఖర్చు చేసి సిసి రోడ్లు నిర్మించామని, వందల మందికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం అందించామని గుర్తు చేశారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు రూ. 3016 నుంచి రూ. 5016 వరకు పెంచుతామని, రైతుబంధు రూ. 12 వేల నుండి రూ. 16 వేలకు పెంచుతామని రైతు భీమా బిపిఎల్ కుటుంబాల న్నిటికీ బీమా సౌకర్యం కల్పిస్తామని మహిళలకు మూడు వేల రూపాయల సౌభాగ్య లక్ష్మి ద్వారా అందిస్తామని నియోజకవర్గంలో రూ. 1350 కోట్ల రూపాయల బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.
కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి కావాలంటే ముచ్చటగా మూడోసారి కేసిఆర్ ప్రభుత్వమే రావాలని, అందుకే ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవసారి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దేశంలోని అగ్రస్థానంలో ఉందని కెసిఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడ అమలు కావడం లేదని చెప్పారు. మాయమాటలతో మీ వద్దకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశానికే గర్వకారణమైన అనేక సంక్షేమ పథకాలు కేసిఆర్ అమలు చేస్తున్నారని, ప్రతి ఇంటా కెసిఆర్ పథకాలు లబ్ధిదారులు అందుకుంటున్నారని వివరించారు. నల్లగొండ శాసనసభ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి మళ్లి గెలిపించి నల్గొండ అభివృద్ధికి దోహదపడాలని కోరారు.
తిప్పర్తి బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు లొడంగి గోవర్ధన్, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి గోదావరి గూడెం ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, గాదె సంధ్య విజయ రెడ్డి, కడారి రామలింగయ్య, మార్త సైదులు, ఎస్కే మొయిజ్, నాయకులు వనపర్తి నాగేశ్వరరావు,కందుల లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ శంకర్ రెడ్డి, వనపర్తి జ్యోతి కొండ స్వరూప పోలరాజు, బొల్లెద్దు వెంకన్న, నవీన్ బిక్షం ఇస్తారి, నాగయ్య దొంతం నాగేశ్వరరావు, మాజీ ఎంపిటిసి దామోదర్ రెడ్డి, ఓంకార్, జన్నారెడ్డి, ఎం శ్రీను, మాజీ సర్పంచ్ జానయ్య చిరంజీవి సాయిలు తదితరులు పాల్గొన్నారు