Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR’s leadership is Sri Ramaraksha for the state: కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

-- పేదోడి సొంతిoటి కలను నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ -- ఉమ్మడి జిల్లాలో అర్హులందరికీ డబ్బులు ఇండ్లు ఇస్తున్నాo -- పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దే -- కాంగ్రెస్, బిజెపి నాయకుల మాయ మాటలకు మోసపోవద్దు --ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కు 12 గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తాం -- నల్లగొండ జిల్లా లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటన

కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

— పేదోడి సొంతిoటి కలను నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్
— ఉమ్మడి జిల్లాలో అర్హులందరికీ డబ్బులు ఇండ్లు ఇస్తున్నాo
— పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దే
— కాంగ్రెస్, బిజెపి నాయకుల మాయ మాటలకు మోసపోవద్దు
–ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కు 12 గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తాం
— నల్లగొండ జిల్లా లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటన

ప్రజా దీవెన/ నల్లగొండ: పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR is the leader who fulfilled the dreams of the poor man’s own home) అని, కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లో పర్యటించిన మంత్రి స్థానిక శాసన సభ్యులు రవీంద్రకుమార్ తో కలిసి ఇండోర్ స్టేడియం ను ప్రారంభించి దేవరకొండ పట్టణం లో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్ ఇళ్లకు సంబంధించిన యాజమాన్య పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభ లో మాట్లాడిన మంత్రి డబుల్ ఇండ్లు పేదల వరం అని అన్నారు. ప్రతీ పేదకు ఇల్లు ఉండాలనేది కేసీఆర్ లక్ష్యం అన్నారు. అర్హులందరికీ డబ్బులు ఇండ్లు ఇస్తున్నామని,  పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇల్లు ( Houses are given to all the deserving ones without spending a penny, and houses are given to the poor) ఇచ్చిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీ దే అన్నారు. రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం లో లేని పథకాలు మన రాష్ట్రం లో ఉన్నయని అన్నారు. బిడ్డ పుట్టిన నుండి పెళ్లి చేసే వరకు ప్రతీ బిడ్డను సంరక్షిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.ప్రతీ ఒక్కరి క్షేమాన్ని కోరుతూ కుటుంబ పెద్దలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఘనత కేసీఆర్ (KCR is credited with ruling the state like the head of the family, seeking everyone’s well-being) నాయకత్వమే అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ,బీజేపీ లు మన రాష్ట్రాన్ని , దేశాన్ని సర్వ నాశనం చేసాయని మండిపడ్డారు. ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి కి నోచుకోని దేవరకొండ కు అభివృద్ధి ని పరిచయం చేసిన నాయకుడు రవీంద్ర కుమార్ అని కొనియాడారు. ఆయన నాయకత్వం లో దేవరకొండ నియోజకవర్గం లో కోట్లాది రూపాయల తో జరిగిన అభివృద్ధి పనులతో దేవర కొండ స్వరూపమే మారిపోయిందని అన్నారు.

రవీంద్ర కుమార్ గెలుపు ఎప్పుడో ఖాయం అయిందన్న మంత్రి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి దేవర కొండ ప్రాంతాన్ని సస్య్యామలం చేసినాం (We completed the Palamuru-Ranga Reddy project and greened the Devara hill area)  అన్నారు. రాష్ట్రం లోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా పంటలు పండిస్తూ అన్నదాతలుబాగుపడ్డారని అన్నారు.ముఖ్యమంత్రి గారికి నల్గొండ అంటేనే ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నారు.నల్గొండ లో ఇంచు భూమి ఖాళీ లేకుండా సస్యశ్యామలం చేసినాం అన్నారు.

వచ్చే ఎన్నికల్లో 12 కి 12 శాసన సభ స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ గెల్చుకుంటుందని (BRS will win 12 out of 12 legislative assembly seats in the next election) మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న మంత్రి కాంగ్రెస్ బిజెపి నాయకుల మాటలకు మోసపోవద్దని,60 ఏళ్ల వారి పాలనలో ఒరిగింది ఏమీ లేదన్నారు.మోసపోతే గోస పడుతం అన్నారు.

అనంతరం గుడి పల్లి మండల కేంద్రం లో నూతనంగా నిర్మించిన తహసిల్డార్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే , ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.