Khammam district Horrific incident : ప్రజా దీవెన, ఖమ్మం: ఖమ్మం నగరంలో పెను విషాద సంఘటన చోటుచే సుకుంది. మామిళ్లగూ డెం లోని ఆ అద్దె ఇం టి నుంచి వస్తు న్న వింత దుర్వాసన స్థానికులను ఉలి క్కిప డేలా చేసింది. ఏదో జరిగింద ని పసిగట్టిన జనం పోలీసులకు స మాచారం అందించారు.తలుపులు తెరిచి పోలీసులు లోపలికి వెళ్లిన ప్పుడు కనిపించిన దృశ్యం చూసి వారు ఒ క్కసారిగా షా క్‌కు గుర య్యారు. అది ఒక ఇల్లు కాదు… ఒక విషాద కా వ్యంలా నిశ్శబ్దంగా మారింది.
ఖమ్మం నగరంలో జరిగిన విషాద సంఘటనకు సంబంధించి పూర్వ పరాలు ఇలా ఉన్నాయి. డిజిటల్ మీడియాలో పని చేసే కణతాల రా ము (30), తన భార్య రమ్య, ఇద్ద రు కు మార్తెలు దివ్యశ్రీ (5), రితిక (3)తో కలిసి ఆ ఇంట్లో నివాస ముంటున్నారు. కానీ ఇప్పుడు ఆ కు టుంబంలో సగం మం ది ప్రాణాల తో లేరు. రాము, అతని పెద్ద కు మార్తె దివ్యశ్రీ విగతజీవులై పడి ఉండగా, భార్య రమ్య ప్రాణాపాయ స్థితి లో అపస్మారకంలో ఉంది. చిన్నారి రితిక తలకు గాయంతో, ఏం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో కనిపిం చింది.
మిస్టరీగా మారిన మరణాలు
పోలీసుల ప్రాథమిక విశ్లేషణ ప్రకా రం రాము రెండు రోజుల క్రితమే చ నిపోయి ఉంటాడని, మృతదేహం స్థితిని బట్టి భా విస్తున్నారు. దివ్యశ్రీ మాత్రం ఈ రోజే కన్నుమూసి ఉం టుం దని ఏసీపీ రమణమూర్తి, ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. అయితే రాము మృతదేహం వద్ద ఉన్న ర క్తపు మరకలు దే నిని సూచిస్తున్నా యని అవి గాయాల వల్ల వచ్చా యా లేక మృతదేహం పాడవ్వడం వల్ల వచ్చిన ద్రవాలా అనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి.
ఇదిలా ఉండగా దివ్యశ్రీ శరీరంపై ఉన్న అంతర్గత గాయాలు ఎవరి వల్ల కలిగాయి ఆ చిన్నారి రితికకు గా యాలు ఎలా అయ్యాయనే విష యాలు ప్రస్తుతం మిస్టరీగా మారా యి. కాగా స్థానికుల మాటలను బ ట్టి చూస్తే, శుక్రవారం రాత్రి ఆ దం పతుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఆదివా రం రమ్య నీర సంగా బయట తిరగడం గమనించిన పొరు గువారు ఆమె పురు గు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రమ్య కోలుకుం టే తప్ప, ఆ ఇం ట్లో అసలు ఏం జ రిగిందనే సమాచారం, రా ము, ది వ్యశ్రీల మరణానికి గల కారణాలే మిటి అనే చిక్కు ముడి వీడే అవకాశం లేదు. ఆ ఇల్లు ఇప్పుడు పో లీసుల నీడలో నిశ్శబ్దంగా సమా ధానాల కోసం వేచి చూస్తోంది.