Kishanreddy lies: కేంద్రం పది లక్షల కోట్లు అక్షరాల పచ్చి అబద్దం
రాష్ట్రoలో గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి స్థాయిలో దుష్ప్రచా రం చేయడం తగదని ఉప ముఖ్య మంత్రి మల్లు పట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
పదేళ్ళలో వచ్చింది కేవలం రూ. 3.70లక్షల కోట్లు
ఆ మాత్రం కూడా రావడం మన రాష్ట్ర హక్కు
బిజెపి చెప్పేవన్నీ బారాబర్ నిరూపించాలి
రూ.3690 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్పారు
రైతుబంధుకు కేటాయించిన రూ.7వేల కోట్లు ఏమయ్యాయో కేసీఆర్ ప్రజలకు తెలియజేయాలి
కేసిఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు ఈ నాలుగు నెలల్లో రూ. 26,374 కోట్లు చెల్లించాము
రాష్ట్రానికి కొత్త విద్యుత్ పాలసీ అవసరం అనిపిస్తోంది
గత ప్రభుత్వం యూనిట్ విద్యు త్తుకు రూ.20 చెల్లించగా, మేము రూ.10లోపు చెల్లిస్తున్నాం
తక్కువ ధరకు వచ్చే గ్రీన్ పవర్ కొనుగోలు ప్రణాళికలు చేస్తున్నాo
ఎన్టీపీసిని విస్మరించి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఎవరి కోసం ప్రారంభించారో తెలియదు
సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కోడ్ ఆప్రాంతాల్లో పర్యటిస్తాము
మీట్ ది ప్రెస్ లో ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రoలో గడిచిన పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి స్థాయిలో దుష్ప్రచా రం చేయడం తగదని ఉప ముఖ్య మంత్రి మల్లు పట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేంద్రం మంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెప్పడం అక్షరాల సుద్ద అబద్దమని, కేవలం రూ. 3,70, 235 కోట్లు మాత్రమే వచ్చాయని విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షం గా, పరోక్షంగా చెల్లించిన పన్నుల నుంచి రాష్ట్రానికి హక్కుగా రావా ల్సిన వాట కూడ రానప్పటికీ ప్రజల ను తప్పుదోవా పట్టించే విధంగా ఓ కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం తెలం గాణకు రూ.10లక్షల కోట్ల రూపా యలు ఇచ్చిందని చేసిన ప్రకటనను తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్లల్లో ఇచ్చిన రూ.10లక్షల కోట్లు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పు రూ.7లక్షల కోట్లు ఏమైనామో వారే చెప్పాలన్నారు. శుక్రవారం హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఓ జర్నలిస్ట్ యూని యన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న మీట్ ది ప్రెస్ లో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
పలు వురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నల కు సమాధానం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం రూ.3690 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పజెప్పిం దన్నారు. కానీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుకు రూ.7వేల కోట్లు కేటాయించామని, ఎన్నికల కమీషన్ అనుమతి ఇస్తే రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారని, గత ప్రభుత్వం మాకు మైనస్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పిందని, ఈ లెక్కన మీరు చెబుతున్న రూ. 7వేల కోట్లు ఏమైనాయ్, మీరే తిన్నారా, లేక ఆ డబ్బులు ఎక్కడకు పోయినట్లు, ఎవరి అకౌంట్లోకి పోయినట్లు, ఎవరి దగ్గర ఉన్నయో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ నాలుగు నెలల్లో వడ్డీలతో పాటు అప్పులు కలిపి మొత్తం రూ.26,37 4 కోట్లు చెల్లించామన్నారు. గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను చిన్నాభి న్నం చేయగా రూపాయి రూపాయి పోగేసి గాడిలో పెట్టి ఓకటో తారీ ఖున ఉద్యోగులకు, పెన్షన్ దారు లకు వేతనాలు చెల్లించే స్ధితికి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల ముం దు కాంగ్రెస్ ప్రకటించిన గ్యా రంటీల అమలులో భాగంగా మహి ళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి, రూ. 500 సిలిండర్, ఆసరా పెన్షన్ల కు సక్రమంగా నిధులు ఇస్తున్నామ న్నారు. అదే విధంగా గత ప్రభుత్వం ఏండ్ల తరబడి పెండింగ్ పెట్టిన మధ్యాహ్నఏజేన్సీ బిల్లులు, ఆశ, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు, గ్రామ పంచాయతీ స్వీపర్ల వేతనాలు ప్రాధన్యత క్రమంలో చెల్లించామన్నారు. సాంఘీక సంక్షేమ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో కొన్ని నెలలుగా గత ప్రభుత్వం డైట్ బిల్లులు చెల్లించకుండ పెండింగ్‌లో పెట్టిందని, మేము అధికారంలోకి రాగానే రివ్యూ చేసి పెండింగ్ బిల్లులు చెల్లించామన్నారు.
విదేశాల్లో చదివే విధ్యార్ధులకు అందించే ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు ఇవ్వకుండ గత ప్రభుత్వం మంజూరు చేసి వెళ్లగా నిధులను మేమే విడుదల చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితీని సరిచేసుకుంటూ ముందు కు వెళ్తున్నామన్నారు. 65లక్షల మంది రైతులకు రూ.5575 కోట్లు రూపాయలు వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశామ న్నారు. మిగత 5లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ట్టు చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభు త్వం కంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లో 93 శాతం మంది రైతులకు రైతు భరో సా డబ్బులు ఇచ్చామని వివరిం చారు. గత ప్రభత్వంలో ఆర్టీసీ ఉంటుందా, మూసేస్తారా, అన్న అనుమానాలు ఉండేవి కానీ కాంగ్రె స్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు గ్యారంటీని అమలు చేసి ప్రతి మ హిళ ప్రయాణం చేసిన జీరో టికెట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లి స్తున్నదన్నారు.
మూడు నెలల్లో రూ.1125 కోట్లు ఆర్టీసీకి చెల్లిం చడం వల్ల ఆ సంస్థ బలోపేతంగా మారిందన్నారు. గృహజ్యోతికి రూ.200 కోట్లు, రాజీవ్ ఆర్యోగ్య శ్రీ కి రూ. 189 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సడికి రూ. 80 కోట్లు, ఉచిత వ్యవసాయ కరెంటుకు రూ. 3924 కోట్లు, రేషన్ బియ్యం సబ్సిడి రూ.1147 కోట్లు రైతు బీమా ప్రిమీయంకు రూ.734 కోట్లు చెల్లించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Dr. YS Rajashekar reddy) మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడం కోసం ప్రారంభించిన వడ్డిలేని రుణాల పథకాన్ని గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ (BRS)ప్రభుత్వం ఆటకెక్కించిందన్నారు. అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను ఆర్ధికంగా స్వాలంభన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డిలేని రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున లక్షల మంది మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న రుణాలపై మహిళలకు వడ్డి చెల్లించామన్నారు.
రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాలసీ అవసరముంది
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి కృషి చేయలేదన్నారు. రూ.20 చోప్పున యూనిట్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజల మీద భారం మోపిందన్నారు. పవర్ ఎక్సేంజ్‌లో పీక్ హవర్స్ కోసం యూనిట్‌కు రూ.10 చొప్పున మాత్రమే తమ ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నదని వివరించారు. తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో పర్యావరణ హితమైన, చవకైన రినోవేబుల్ ఎనర్జీని రాష్ట్ర ప్రజలకు అందించడానికి కొత్త విద్యుత్తు పాలసీ తీసుకురావడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. గత నెల 8న 15,623 మెగావాట్ల పీక్ డిమాండ్ అందించడం జరిగిందన్నారు. 2030 నాటికి 30వేల మెగావాట్ల పీక్ డిమాండ్ అందించడానికి ప్రణాళికలు రూపొందించుకొని తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విభజన చట్టంలో 4వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేటాయించినప్పటికీ 10 ఏండ్లు అధికారంలో ఉండి విస్మరించి, తెలంగాణకు(Telangana)
గుదిబండగానున్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటులను ప్రారంభించిన బిఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఎన్టీపీసీ విద్యుత్తు గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. రాబోయే 25 సంవత్సరాలకు సోలార్ విద్యుత్తును యూనిట్‌కు రూ.5.59 చొప్పున అందించడానికి టెండ్లర్లు వస్తున్న నేపత్యంలో యూనిట్‌కు రూ.8 నుంచి 9 చొప్పున ఖర్చు అయ్యే ఎన్టీపీసీతో పీపీఏ చేసుకోవడం లేదని విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై భారం మోపకుండ తక్కవ ధరకు గ్రీన్ ఎనర్జీ అందించే సోలార్, పంప్డ్ స్టోరేజీ, సాలీడ్ వేస్ట్, విండ్ పవర్ ఇచ్చే విధంగా కొత్త పవర్ పాలసీని తీసుకురావడానికి కార్యచరణ ప్రారంభమైందన్నారు.
ఎన్నికల కోసం నీళ్లు వదిలి గత పాలకులు కరువు సృష్టించారు.
ప్రాజెక్టులలో ఉన్న నీళ్లను ఎన్నికల సమయంలో ఓట్లు పొందడానికి వృధాగా వదిలి గత పాలకులు కృత్రిమ కరువును సృష్టించారని మండిపడ్డారు. కృష్ణా నదిలోని శ్రీశైలం, నాగర్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీళ్లను జాగ్రత్త భద్రపరుచుకొని వేసవిలో నీటి ఎద్దడి రాకుండ చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి ఎన్నికల్లో ఓట్లు పొందడానికి కాలువల వెంట నీళ్లు పారించి వృదాగా సముద్రంలోకి వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ కుంగిపోవడం వల్ల గత పాలనలోనే నీళ్లను దిగువకు వదిలారన్నారు. గత పాలకులు నీటి యజమాన్య పద్దతులు పాటించకుండ అనేక తప్పిదాలు చేయడం వల్లనే ఇప్పుడు నీటి కొరత ఎదురైందన్నారు.
వారు చేసిన తప్పులను సరిదిద్దుతూ నీటి ఎద్దడి సమస్యలను అధిగమించడానికి అధికార యంత్రాంగంతో సమీక్షలు చేస్తూ రూ.100 కోట్లు అందుబాటులో ఉంచామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) మంచి నీటి కొరత రానివ్వమన్నారు. మంచి నీటి ఎద్దడిని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇందుకు ఎన్ని నిధులైన వెచ్చిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రూ.43వేల కోట్లతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ప్రయోజనం కనిపించాలి కదా? ఎందుకు కనిపించడం లేదన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాల ప్రభావమే ఆపథకం కనిపించకుండ పోయిందన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసిన మా ప్రభుత్వానికి ఐదేండ్లు డోకా లేదు
ఎవరెన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్‌ప్రభుత్వానికి ఐదేండ్లు డోకా లేదన్నారు. ఐదు ఏండ్లు ప్రభుత్వం నిలబడుతుందన్నారు. కోరి కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ ఐదు ఏండ్లు ప్రజల లక్ష్యాలు నెరవేర్చే విధంగా పాలన అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపకుండ రాష్ట్ర ఆదాయం పెంచుతామన్నారు.
విద్య హక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తాము
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధన్యత ఇస్తుందన్నారు. అధికారంలోకి రాగానే మొదటి బడ్జెట్‌లో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ భవనాల నిర్మానాలకు రూ.4వేల కోట్లు కేటాయించామన్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. విద్యను వ్యాపరంగా మార్చాడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందన్నారు. పది ఏండ్లు అమలు కాని విద్య హక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రయివేటు, కార్పోరేట్ విద్య సంస్థల్లో ఫీజుల నియంత్రణపై దృష్టి సారించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము…, కోడ్ తరువాత ఆప్రాంతాల్లో పర్యటిస్తాము
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాము. విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో తప్పని సరిగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటాము. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇందులో భాగమేనని వివరించారు. ఎన్నికల కోడ్ (election code)తరువాత పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు జోడేడ్లుగా పాలన సాగిస్తామన్నారు. సంక్షేమానికి వెచ్చించే నిధులను దుబారాగా చూడొద్దన్నారు. ప్రాధన్యత క్రమంలోనే ఆర్ధిక శాఖ నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నట్టు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
Kishanreddy lies on central funds