Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Kodad Realtor Fraud : బిగ్ బ్రేకింగ్, కోదాడలో ఘరానా మోసం, రూ.11 కోట్లతో రియల్టర్ జంప్ 

-- 60 మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టిన జితేందర్‌రెడ్డి --ఏడాది దాకా పైసలివ్వనంటూ బాధితులకు నోటీసులు --వ్యాపారి ఇంటి ముందు టెంట్ వేసి బాధితుల ఆందోళన

 

Kodad Realtor Fraud : ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపే ట జిల్లా కోదాడలో ఓ ప్రముఖ స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యా పారి నమ్మిం చి నట్టేట ముంచాడు. అధిక వడ్డీ లు ఇస్తానని నమ్మబలికి స్థానిక రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.11 కోట్ల వరకు వసూలు చేసి, రాత్రికి రాత్రే బోర్డు తిప్పే శాడు.

మోసపోయామని గ్రహించిన బాధి తులు సదరు వ్యాపారి ఇంటి ముం దు బైఠాయించి ఆందోళనకు దిగా రు.స్థానిక పోలీసులు, స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం కోదాడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి జితేం ద ర్‌రెడ్డి గత కొం తకాలంగా రియల్ ఎ స్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్ర మంలోనే సు మారు 60 మంది రై తులు, స్థానికుల నుంచి భారీ మొ త్తం లో వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు.

అయితే, గత కొన్ని రోజులుగా అసలు, వడ్డీ చెల్లించకపోగా తాజా గా బాధితులందరికీ షాకిస్తూ ఒక నోటీసు పంపాడు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఏడాది వ రకు ఎవరికీ ఒక్క రూపా యి కూడా తిరిగి ఇవ్వలేను” అని ఆ నోటీసు లో పేర్కొన్నా డు. డబ్బులు అడి గి తే ఇస్తాడనుకున్న వ్యాపారి, ఏకం గా ‘ఏడాది దాకా పైసలివ్వను’ అంటూ నోటీసులు పంపడంతో బాధి తులు లబోదిబోమంటున్నారు.

  ఇంటిముందు టెంట్లు వేసి బాధితుల నిరసన

నోటీసు చూసి విస్తుపోయిన బాధి తులు మంగళవారం కో దాడలోని జితేందర్‌రెడ్డి నివాసానికి చేరుకు న్నారు. అప్పటి కే అతను ఇళ్లకు తాళం వేసి కుటుంబంతో సహా ప రార య్యాడు. దీంతో తీవ్ర ఆగ్రహాని కి లోనైన రైతులు, బాధితు లు వ్యాపారి ఇంటి ముందే టెంట్లు వేసి ఆందోళనకు దిగా రు. తమకు న్యా యం జరిగే వరకు, తమ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

లక్షలాది రూపాయల కష్టార్జితాన్ని నమ్మి అప్పగిస్తే ఇలా మో సం చేస్తారా అని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం నిం దితుడు జితేంద ర్‌రెడ్డి పరారీలో ఉండగా, బాధితులు పోలీ సులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Related Articles

Back to top button