Kodad road accident : ప్రజా దీవెన, కోదాడ: ఒక సా ధారణ ప్రయాణo కానీ అది చివరి ప్ర యాణంగా మారింది. మున్సిపల్ పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామానికి చెంది న యువకుడు షేక్ రహీం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం వెలు గులోకి వచ్చింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, రంజాన్ పండుగ సంద ర్భంగా తన గాజుల వ్యాపారం కోసం సరు కులు కొనుగోలు చేయడానికి బు ధవారం మధ్యాహ్నం సమయంలో ఖమ్మం వైపు బయలుదేరిన రహీం, ముదిగొండ సమీపంలో ప్రమా దానికి గురయ్యాడు. వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అత ను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.
స్థానికులు వెంటనే స్పందించి, అత న్ని గుర్తించి అంబు లె న్స్‌కు సమా చారం అందించారు. అనంతరం ఖమ్మం ప్రభు త్వ ఆసుపత్రికి తర లించగా, వైద్యులు పరిస్థితి విష మంగా ఉందని చెబుతూ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉ స్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. హైదరా బాద్‌లో చికి త్స పొందుతూ రహీం ప్రాణాల కో సం పోరా డినా, చివరకు శుక్రవారం మృతి చెందాడు.
ఈ వార్త గ్రామానికి చేరుకున్న వెం టనే తమ్మరబండపా లెం లో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విల పిస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమా ర్తె ఉన్నారు.ఒక క్షణంలో జరిగిన ప్ర మాదo ఒక కుటుంబం భవిష్యత్తు నే చీకటిలోకి నెట్టేసింది.