Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 1:33 pm Posted by : praja deveena

Kolkata Warehouse Collapse : బిగ్ బ్రేకింగ్, కలకత్తాలో కుప్ప కూ లిన భారీ గోడౌన్, ఎనిమిదిమంది దుర్మరణం 

Kolkata Warehouse Collapse : ప్రజా దీవెన, కోల్ కత్తా: నిర్మాణ రంగంలో భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం మరోసారి ఘోరకలిని మిగిల్చింది. నగరంలో నిర్మాణంలో ఉన్న ఒక భా రీ గోడౌన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అ క్కడికక్కడే ప్రాణాలు కోల్పో గా, శి థిలాల కింద మరో 40 మందికి పై గా కార్మికులు చి క్కుకుపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద తీవ్రతతో ప్రస్తుత పరిస్థితి ప్రకారం మృతుల సంఖ్య 8 మంది ప్రాథమిక సమాచారం ప్రకారం చిక్కుకుపోయిన వారు 40 మంది కి పైగా కార్మికులు ఉన్నారు. ప్రమాద స మ యంలో సుమారు50 నుం డి 60 మంది కార్మికులు విధులు ని ర్వహిస్తున్నారు. గాయపడిన క్షత గాత్రులను స్థానిక ఆసు పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక పోలీసులు శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమ య్యారు. కాలంతో పోటీ పడుతూ, శిథిలాల కింద చిక్కుకు న్న ప్రాణాలను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి.భవన నిర్మాణంలో నాణ్యతాలో పాలు ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు దర్యా ప్తు ప్రారంభించారు. బాధితుల కుటుంబాల్లో ప్రస్తుతం తీవ్ర విషాదం అలుముకుంది.