పదేళ్ళు పదిలంగా రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగడం ఖాయమని, ఆ పదేళ్ళు సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగడం అంతే ఖాయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ముచ్చటలేకుండా ముఖ్యమంత్రిగా ఆయనే
మా పార్టీలో గ్రూపుల్లేవు ఏక్‌నాథ్‌లూ లేరు..
హరీశ్ రావు, ఏలేటి నోరు అదుపులో పెట్టుకోవాలి
కుల, మతాల మధ్య చిచ్చుకు బీజేపీ ప్రయత్నం
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగడం ఖాయమని, ఆ పదేళ్ళు సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగడం అంతే ఖాయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నల్లగొండలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లా డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకు నే ప్రసక్తే లేదని హెచ్చరించారు.నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఇకపై పనికిమాలిన చిట్‌చాట్‌లు మానుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకోవడం ఖాయమ న్నారు.
బీఆర్‌ఎస్ ఒక సీటు గెలు చుకున్నా తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తనపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు నోరు పారేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఏక్‌నాథ్‌షిండే అనే వ్యక్తిని బీజేపీ సృష్టించిందని, మహారాష్ట్రలో ఎన్‌సీపీ, శివసేనను చీల్చి సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌లు లేరన్నారు. కేసీఆర్ కూడా 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను కొని ప్రతిపక్షాన్ని లేకుండా చేశాడని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌లో 5 గ్రూపులు ఉన్నాయనడం తగదని, తమ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం లో అందరం ఒకే టీంగా ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు తెలంగాణ దోపిడీకి గురైందని, తమ సర్కారు దాన్ని సరిదిద్దుతోందని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన ఏ నాయకుడైనా అపార్థాలను సృష్టించే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీజేపీ కులమతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కనివిని ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి అండగా మంత్రి కోమటిరెడ్డి…. నల్లగొండ మండలం నర్సింగ్ భట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరోజు స్వామి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన విషయాన్ని తెలుసుకొని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది. వారి కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు అండగా ఉంటానని,వారి కుమారుడు, కూతురు చదువుకోవడానికి పూర్తిగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాసాని లింగస్వామి గౌడ్,బొమ్మగోని సత్యనారాయణ,బొమ్మగోని సైదులుగౌడ్,తిరుమల రాము, పుట్ట రాకేష్,బల్లెం ప్రవీణ్ కుమార్,సూరారపు నగేష్,రాపోలు రమేష్,వల్లకీర్తి సత్తయ్య,మర్రి సతీష్,మర్రి ఏడుకొండలు యాదవ్,కంభం మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.