Praja Deveena
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 2:24 pm Posted by : praja deveena

Komatireddy raj gopal reddy sensational comments : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అడగడం చేతకాదు కొట్లాట ఒక్కటే తెలుసు

Komatireddy raj gopal reddy sensational comm ents : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చతో వార్తల్లో నిలిచే నేత నల్లగొండ జిల్లా ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త క లకలం రేపుతున్నాయి. తనదైన శైలిలో ఘాటైన వి మర్శ లు, ఆస క్తికరమైన అంశాలను ఆయన పంచుకున్నా రు. ఆ విశేషాలు మీకోసం..తన రాజకీయ ప్రస్థానంపై స్పందిస్తూ రా జగోపాల్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “పదవుల కోసం పడిగాపులు కాయడం, నాయకుల ముందు అడుక్కో వడం నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే.. నా నియో జకవర్గం కోసం, ప్రజల కోసం కొట్లాడటం,” అని తే ల్చి చెప్పా రు.

  ఉప ఎన్నికల హోరు.. ఆవందమంది ఎమ్మెల్యేలు

గతంలో తాను రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లిన సంద ర్భాన్ని గుర్తుచేస్తూ, అప్పుడు తన నియోజకవర్గం ఎలా మా రిందో వివరించారు. “నేను ఉప ఎన్నికకు వెళ్తే, నా నియోజక వర్గంపై వంద మంది ఎమ్మెల్యేలు పడ్డారు. అంటే, నా పోరా టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తన బలాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.

   మేం అన్నదమ్ములమే.. కానీ వేరు

అన్నదమ్ముల మధ్య రాజకీయ భేదాభిప్రాయాల గురించి వ స్తున్న వార్తలకు ఆయన పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. “నేను, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుల మే కావచ్చు, కానీ మా కుటుంబా లు వేరు. ఆయనతో నాకు ఎటువంటి విభే దాలు లేవు, అలాగని రాజకీయంగా మా నిర్ణయాలు వేరు,” అని క్లారిటీ ఇచ్చారు.

  మంత్రి పదవి చిచ్చు.. అసహనం

తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. మంత్రి పదవుల కేటాయింపు పారదర్శకంగా జ రగలేదని, అధిష్ఠానం హామీ ఇచ్చిన వారికే పదవులు దక్కా యని పేర్కొన్నా రు. “వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి రావడం వె నుక నా ప్రమేయం ఏ మీ లేదు. అందరికీ ఇచ్చినట్టే నాకు కూడా ఇస్తారని ఆశించాను, కానీ నాకు మాత్రమే మొండిచే యి ఎదురైంది,” అని తన అసం తృప్తిని బయటపెట్టారు.

ఇదిలా ఉండగా రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆయన స్వ తంత్ర రాజకీయ శైలిని, తన పార్టీ అధిష్ఠానంపై ఉన్న అ సహనాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు ఈ మాట లు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడు తూ వస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సంబం ధించి అనేక చర్చోప చర్చలకు దారితీ స్తున్నాయి. పార్టీ మా రడం ఖాయంగా అందులో ఏ పార్టీలో చేరేది అనే విషయం లో అనేక ఊ హగానాలు వెలువడుతున్నాయి.